Switch to English

గుడ్లు, టమోటాలతో చంద్రబాబుని గెలిపించిన వైసీపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

చేతికి ఐదొందలిస్తే చాలు, ఎవరి మీదైనా గుడ్లు, టమోటాలు.. వీలైతే రాళ్ళు కూడా విసిరే జనాలున్నప్పుడు ఏ రాజకీయ పార్టీకి అయినా అది ఓ వరమే కదా.! ఈ జనాలు కొత్తగా ఏమీ పుట్టుకు రాలేదు. ఎప్పటినుంచో ఈ ట్రెండ్‌ వున్నదే. అయితే, ఈ గత కొంతకాలంగా ఈ వికృత సంప్రదాయం మరుగున పడిపోయింది. మళ్ళీ అదిప్పుడు ఊపిరి పోసుకుంటోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుణ్యమా అని.

విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబుని అడ్డుకునేందుకు మనిషికి 500 రూపాయలు చెల్లించి మరీ తీసుకొచ్చింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ‘వాళ్ళూ వాళ్ళూ బాగానే వుంటారు.. 500 కోసం మన జీవితాలు నాశనం చేసుకోవాలా.? పార్టీ కార్యక్రమం కోసం రమ్మంటే వచ్చాం.. దాడులు చేయడానికైతే మేం ఒప్పుకోం..’ అంటూ ‘పెయిడ్‌ బ్యాచ్‌’ ఎదురు తిరిగేసరికి, విశాఖ వైసీపీ నేతలకు దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది.

అయితే, మరికొందరు మాత్రం తీసుకున్న డబ్బులకి బాగానే న్యాయం చేశారు. చంద్రబాబు మీదా, పోలీసుల మీదా గుడ్లు, టమోటాలతో దాడులు చేశారు. ఇంతకీ, అవన్నీ వారికి ఎలా వచ్చాయ్‌.? అంటే, ఇదంతా పక్కా ప్లానింగ్‌తోనే జరిగిందనే విషయం అర్థమవుతోంది. ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లోకి ముందుగానే అసాంఘీక శక్తులు ప్రవేశించాయి. రోడ్డు మధ్యలో వుండే మొక్కల మాటున బ్యాగుల్లో గుడ్లు, టమోటాల్ని కొందరు దాచారు. చంద్రబాబు ఇలా ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారో లేదో.. అలా ఆ బ్యాగుల్లోంచి ‘ఆయుధాల్ని’ బయటకు తీసి ఎంపిక చేసుకున్న కొందరికి పంచారు.

ఇలా గుడ్లు, టమోటాలు విసినవారికి అప్పటికప్పుడు అదనంగా 1000 నుంచి 2000 రూపాయల వరకు ఇచ్చారట కూడా. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ వుంటుంది. మూడు రాజధానుల్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్న దరిమిలా, ఆయనకు నిరసన తెలపాలనుకుంటే దానికి చాలా మార్గాలున్నాయి.

అమరావతిలో గత డెబ్భయ్‌ రోజులుగా ఏం జరుగుతుందో చూస్తున్నాం. ముఖ్యమంత్రి, ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాల నుంచే అసెంబ్లీకి వెళుతున్నారు. ఏ రోజన్నా అక్కడ ఇలాంటి ఘటనలు జరిగాయా.? జరిగితే, పరిస్థితి కాల్పులదాకా వెళ్ళేదేమో.! అంతా ఓ పద్ధతి ప్రకారమే జరిగింది విశాఖలో. ఇది చంద్రబాబుని అవమానించేందుకా.? రాజకీయంగా చంద్రబాబుకి మైలేజ్‌ పెంచేందుకా.? అన్నది మాత్రం తేలాల్సి వుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...