Switch to English

సినిమా రివ్యూ: విజయ్ సేతుపతి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

నటీనటులు: విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, నివేత పేతురాజ్
నిర్మాత: రావూరి వి శ్రీనివాస్
దర్శకత్వం: విజయ్ చందర్
సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్రాజ్
మ్యూజిక్: వివేక్ – మెర్విన్
ఎడిటర్‌: ప్రవీణ్ కెఎల్
విడుదల తేదీ: నవంబర్ 15, 2019
రేటింగ్: 1.5

తమిళ హీరో విజయ్ సేతుపతికి తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. తమిళంలో అతడు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన కొన్ని సినిమాలు ‘పిజ్జా’, ‘నేను రౌడీనే’, ‘నవాబ్’, ‘పేట’, ‘అంజలి సిబిఐ’ తెలుగులో డబ్బింగ్ అయ్యి హిట్స్ అయ్యాయి. తమిళంలో ‘విక్రమ్ వేద’, ‘సూపర్ డీలక్స్’ సినిమాలను చూసినవారు కూడా ఉన్నారు. ‘సైరా నరసింహారెడ్డి’లో రాజా పాండీ క్యారెక్టర్ ద్వారా విజయ్ సేతుపతి మ్యాగ్జిమమ్ ఆడియన్స్ కి తెలిశాడు. దాంతో అతడు తమిళంలో నటించిన ‘సంగ తమిళన్’ సినిమాను తెలుగులో ‘విజయ్ సేతుపతి’గా డబ్బింగ్ చేశారు. తమిళంలో, తెలుగులో ఒకే డేట్ కి రిలీజ్ చేశారు. సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ కోసం ఈ కథ రాసుకున్నానని దర్శకుడు విజయ్ చందర్ చెప్పారు. పవన్ రేంజ్ కి తగిన బలమైన కథేనా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

ఓపెన్ చేస్తే… ఒక కోర్టు. అందులో ఓ కేసు. గ్రామంలో కొత్తగా పెట్టబోయే కాపర్ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం పెరుగుతుందని, ప్రజలు అనారోగ్యం పాలవుతారని కొందరు యువకులు కేసు వేస్తారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత జడ్జ్ గారు వాయిదా వేస్తారు. కట్ చేస్తే… సిటీలో హీరో ఎంట్రీ. సినిమాల్లో హీరో ఛాన్సులు కోసం చరణ్ (విజయ్ సేతుపతి) ట్రై చేస్తున్నాడు. ఓ పెద్ద బిజినెస్ మేన్ కూతురు కమలిని (రాశి ఖన్నా), చరణ్ ప్రేమలో పడతారు. కూతురుని ప్రేమించిన చరణ్ ను బిజినెస్ మేన్ ఇంటికి పిలిచి… తన స్నేహితుడైన ఎమ్మెల్యే దేవరాజ్ (నాజర్), అతడి కుమారుడు విజయ్ సేతుపతి (విజయ్ సేతుపతి) చేస్తున్న మంచిని ప్రత్యర్ధులు తట్టుకోలేక చంపేశారని, వాళ్ల గ్రామంలో పెట్టబోతున్న కంపెనీని అడ్డుకుంటున్నారని చెప్తాడు. విజయ్ సేతుపతిగా నటించి గ్రామానికి మంచి చెయ్యమని చరణ్ ని కోరతాడు. అందుకు పది కోట్లు ఇస్తానని చెప్తాడు. విజయ్ సేతుపతిగా నటించడానికి వెళ్లిన చరణ్ ఏం చేశాడు? విజయ్ సేతుపతి, అతడి తండ్రిని చంపిన మాజీ ఎమ్మెల్యే చరణ్ ని ఎలా చిక్కుల్లోకి నెట్టాడు? ఫ్యాక్టరీ వల్ల గ్రామానికి నిజంగా మంచి జరిగెట్టట్టు అయితే, అది వద్దంటూ కొందరు యువకులు ఎందుకు కేసు వేశారు? గ్రామ సమస్యను చరణ్ ఎలా పరిష్కరించాడు? బిజినెస్ మేన్ కి చరణ్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? అన్నదే కథ.

సీటీమార్ పాయింట్స్

ఆన్ స్క్రీన్:

తెరమీద మనల్ని బాగా ఆకట్టుకునేవి ఫస్టాఫ్ లో విజయ్ సేతుపతి, రాశి ఖన్నా మధ్య వచ్చే రెండు మూడు సీన్స్, సాంగ్స్. వాంటెడ్ గా హీరోయిన్ ని హీరో కలవాలని ట్రై చేశాడనేది ఫస్ట్ సీన్ లో మనకు తెలుస్తుంది. డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. హీరోని హీరోయిన్ కలిశాక, స్క్రీన్ మీద వస్తున్న సీన్స్ చూశాక…. హీరోయిన్ ఈజీగా లవ్ లో పడుతుందని చెప్పొచ్చు. కానీ హీరోకి హీరోయిన్ ప్రపోజ్ చేశాక వచ్చే సీన్ రొటీన్ అయినా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. కమెడియన్ సూరితో హీరో సీన్స్ కొన్ని పర్లేదు. ‘కళ్లతోనే ఓ సీతాకోక చిలుక పిలిచెను’ మెలోడీ బాగుంది. ‘కమల కమల’ సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవచ్చు. ట్యూన్ మాసీగా, క్యాచీగా ఉన్నా, లిరిక్స్ దరిద్రంగా ఉన్నాయి. మెలోడీ సాంగ్ బాగా రాసిన రాకేందు మౌళి, మాస్ సాంగ్ ను చెడగొట్టారు.

ఇక నటీనటుల పరంగా చెప్పుకోవాలంటే… ముందుగా రాశి ఖన్నా గురించి చెప్పుకోవాలి. తెలుగులో ‘సుప్రీమ్’, ‘టచ్ చేసి చూడు’ సినిమాల్లో కామెడీ టైమింగ్ తో చిట్టకొట్టారు. వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’తో లవ్ స్టోరీస్ కి పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించుకున్నారు. ఈ సినిమాలో క్యారెక్టర్ కి తగ్గట్టు అందంగా కనిపించారు. రాశి ఖన్నా ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. గతంలో సినిమాల్లో చుసిన విజయ్ సేతుపతి వేరు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి వేరు. వెయిట్ బాగా పెరగడంతో స్క్రీన్ మీద భారంగా కదిలాడు. పెర్ఫార్మన్స్ పరంగా కొన్ని సీన్స్ లో చింపేశాడు. కానీ ఓవరాల్ గా సినిమాకి ది బెస్ట్ ఇవ్వలేకపోయాడు. పెద్ద బిజినెస్ మేన్ గా, కార్పొరేట్ విలన్ గా రవికిషన్ పాత్ర పరిధి మేరకు నటించాడు.

ఆఫ్ స్క్రీన్:

ఆఫ్ స్క్రీన్ అంటే… ఆర్. వేల్రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాత ఖర్చుపెట్టిన ప్రతి రూపాయిని స్క్రీన్ మీద చూపించాడు.పైన చెప్పిన ‘కళ్ళతోనే ఓ సీతాకోక పిలిచెను’ సాంగ్ ను సూపర్బ్ గా పిక్చరైజ్ చేశారు. వేల్రాజ్ విజువల్స్ బాగున్నాయి. నెక్స్ట్, విజయావారి ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. స్క్రీన్ మీద రిచ్ నెస్ కనబడింది.

మైనస్ పాయింట్స్

ఆన్ స్క్రీన్:

‘పవన్ కల్యాణ్ కోసం రాసుకున్న కథ’ అని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో డైరెక్టర్ విజయ్ చందర్ చెప్పారు. సినిమా స్టార్ట్ అయిన టెన్ మినిట్స్ నుండి ఏ యాంగిల్ లో పవన్ కల్యాణ్ తో ఈ సినిమా చేద్దామనుకున్నారు అనే డౌట్ స్టార్ట్ అవుతుంది. ‘పంజా’లో పవన్ కల్యాణ్ చేసిన పనులు అన్నీ బ్రహ్మానందం అకౌంట్ లో వేస్తారు. ఈ సినిమాలో కమెడియన్ సూరిని విజయ్ సేతుపతి సార్ సార్ అంటూ ఉంటారు. ప్రతి పనిని సూరి అకౌంట్ లో వేస్తూ ఉంటాడు. ఇలా వచ్చే సీన్స్ చూస్తుంటే ఎన్నో సినిమాల్లో చూసేశామనే ఫీలింగ్ కలుగుతుంది. పోనీ కథ కొత్తగా ఉందా అంటే అదీ లేదు. కమర్షియల్ మీటర్ లో సాగుతుంది. లవ్ ట్రాక్ నుండి ఫ్యామిలీ ఎమోషన్స్ వరకు ప్రతిదీ గతంలో ఎక్కడో ఏదో ఒక సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది. ఫ్యాక్టరీ పొల్యూషన్, గ్రామస్థుల రిజెక్షన్ వంటివి ఎన్నో సినిమాల్లో డిస్కస్ చేసిన పాయింట్స్. మళ్ళీ అవే పాయింట్స్ తిప్పి తీసినట్టు అనిపిస్తుంది.

తమిళ్ లో హీరో విజయ్ సేతుపతి ఇమేజ్ మీద డిపెండ్ అయ్యి తీసిన సినిమాగా అన్పిస్తుంది. అటువంటి అప్పుడు సినిమాలో వచ్చే సీన్స్, ఫైట్స్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉండాలి. ఈ సినిమాలో అటువంటి సీన్ మచ్చుకు ఒక్కటి కూడా కనిపించదు. కన్నడ స్టార్ యష్ కి తెలుగులో మినిమమ్ గుర్తింపు లేకున్నా, ‘కెజిఎఫ్’ పెద్ద హిట్టయ్యిందంటే రీజన్ ఆ హీరోయిజమ్ ఎలివేట్ చేసే షాట్స్. విజయ్ సేతుపతిలో అటువంటి ఎలివేషన్ ఫైట్ గాని, షాట్స్ గాని లేవు. స్టార్టింగ్ హీరో ఇంట్రడక్షన్ ఫైట్ మరింత బాగా చేసే ఛాన్స్ ఉంది. కొంతవరకు స్టయిలిష్ గా ఉంటుంది. కానీ మధ్యలో ఫైట్ ని క్లోజ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. సెకండాఫ్ లో హీరోని పబ్లిక్ లో ఫాలోయింగ్ ఉన్న లీడర్ గా ప్రాజెక్ట్ చేసే సీన్స్ కూడా సరిగా తీయలేదు. సో… సినిమా మరీ రొటీన్ గా మారింది.

ఆర్టిస్టుల విషయానికి వస్తే… టాలెంటెడ్ యాక్టర్ నాజర్ ఏమీ చేయలేకపోయారు. ఆయనకు ఇచ్చిన పాత్ర మరీ రొటీన్. నివేదా పేతురాజ్ ఎన్నో సినిమాల్లో చూసిన మరదలి క్యారెక్టర్ చేసింది. విలన్ గా అశుతోష్ రాణా ఓవర్ యాక్టింగ్ చేశాడు.

ఆఫ్ స్క్రీన్:

కమర్షియల్ సినిమాల్లో మరీ కొత్త కథను ఆశించలేం. ప్రేక్షకులకు తెల్సిన కథను కొత్తగా చెప్పగలగడమే డైరెక్టర్ టాలెంట్. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా సీన్స్, ఫైట్స్ తీయడమే డైరెక్టర్ ఆర్ట్. విజయ్ చందర్ లో టాలెంట్, ఆర్ట్ పెద్దగా లేవని ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది. రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ పేషెన్స్ టెస్ట్ చేస్తాడు. రొటీన్ స్టఫ్ చేతిలో పెడితే ఎడిటర్ మాత్రం ఏమి చేయగలడు? ఏదో రెండు సాంగ్స్ సోసోగా ఇచ్చిన వివేక్-మెర్విన్, మిగతా సాంగ్స్ ను రొట్ట కొట్టుడు కొట్టారు. రీరికార్డింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చెవులకు చిల్లులు పడేలా లౌడ్ రీరికార్డింగ్ తో దంచి కొట్టారు. డబ్బింగ్ డైలాగ్ రైటర్ మల్లూరి వెంకట్ అవుట్ డేటెడ్ డైలాగులతో ఇంకా ఏ కాలంలో ఉన్నామనే ఫీలింగ్ కలిగించాడు. ఒక్కటి అంటే ఒక్క పంచ్ డైలాగ్ కూడా బాగోలేదు. ఇంపార్టెంట్ టెక్నికల్ డిపార్మెంట్స్ కలిసికట్టుగా ఫెయిల్ అయ్యాయి.

విశ్లేషణ:

తమిళ్ లో కొత్త కాన్సెప్ట్స్ తో మంచి మంచి సినిమాలు తీస్తారని కొందరి ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్… ఖైదీ. కానీ అక్కడ కూడా పరమ రొట్ట కొట్టుడు రొటీన్ సినిమాలు వస్తాయని, కంప్లీట్ గా హీరో ఇమేజ్ మీద డిపెండ్ అయ్యి సినిమాలు తీస్తారని ‘విజిల్’, ‘విజయ్ సేతుపతి’ చూస్తే అర్థమవుతుంది. కనీసం రెండు గంటల సినిమాలో గంట కూడా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే మెటీరియల్ ఈ సినిమాలో లేదు. ఒక ఫైట్, సాంగ్, కామెడీ సీన్ అంటూ డైరెక్టర్ కమర్షియల్ టెంప్లెట్ లో స్టోరీ రాసుకుని, తీసుకుపోయాడు. హీరో పేరును డబ్బింగ్ ప్రొడ్యూసర్స్ తెలుగు టైటిల్ గా ఫిక్స్ చేశారు. సినిమాలో కంటెంట్ లేదని ముందుగా వాళ్లకు తెలిసిపోయిందేమో. ఆడియన్స్ కి హింట్ ఇచ్చారేమో. కంప్లీట్ సినిమా చూశాక, ఈ స్టోరీతో పవన్ కల్యాణ్ తో సినిమా తీద్దామని డైరెక్టర్ ఎలా అనుకున్నాడని ఆడియన్స్ అనుకునేట్టు ఉంది. ఇంకా నయం… పవన్ కల్యాణ్ చేయలేదు.

ఫైనల్ పంచ్: ఈ సినిమాతో సేతుపతికి విజయం దక్కడం కష్టమే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

ఎక్కువ చదివినవి

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...
నటీనటులు: విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, నివేత పేతురాజ్ నిర్మాత: రావూరి వి శ్రీనివాస్ దర్శకత్వం: విజయ్ చందర్ సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్రాజ్ మ్యూజిక్: వివేక్ - మెర్విన్ ఎడిటర్‌: ప్రవీణ్ కెఎల్ విడుదల తేదీ: నవంబర్ 15, 2019 రేటింగ్: 1.5 తమిళ హీరో విజయ్ సేతుపతికి తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. తమిళంలో అతడు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన కొన్ని సినిమాలు 'పిజ్జా', 'నేను రౌడీనే', 'నవాబ్', 'పేట', 'అంజలి...సినిమా రివ్యూ: విజయ్ సేతుపతి