Switch to English

అతి స్పందన.. ‘కోరిక’ ముదిరి.. ఆసుపత్రిలో చేరి..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

అతిసర్వత్ర వర్జయేత్ అని ఊరికే అనలేదు. ఏది ఎంత అవసరమో అంతవరకే అనుసరించాలి. ఎలా చేయాలో అలాగే చేయాలి. అలా కాదని ఇష్టమొచ్చినట్టు చేస్తే అనర్థాలు తప్పవు. మనిషి జీవితంలో విడదీయలేని భాగమైన శృంగారం విషయంలోనూ ఇది వర్తిస్తుంది. అలా కాకుండా ప్రకృతికి విరుద్ధంగా, అతి తెలివి ఆలోచనలతో ముందుకెళితే ముప్పు తప్పదని ఓ యువకుడి ఉదంతం నిరూపించింది. బెర్లిన్ కు చెందిన డానీ పొలారిస్ అనే యువకుడు స్వలింగ సంపర్కుడు.

పైగా అతడికి శృంగారపరమైన కోరికలు చాలా ఎక్కువ. ఈ క్రమంలో ఓ రోజు తన అంగం ఎక్కువ సేపు స్తంభించి ఉంచాలనుకుని భావించి ఓ ఇంజక్షన్ ను నేరుగా దానికే తీసుకున్నాడు. అదే తాను చేసిన అతిపెద్ద తప్పు అనే సంగతి తెలుసుకోవడానికి అతడికి ఎంతో సమయం పట్టలేదు. తొలుత రెండు గంటల వరకు బాగానే ఎంజాయ్ చేశాడు. అప్పటి నుంచి అతడికి కష్టాలు మొదలయ్యాయి.

గంటలు గడుస్తున్నా స్తంభించిన అంగం మామూలు స్థితికి రావడంలేదు. డోస్ ఎక్కువైందేమో.. కాస్సేపటికి వస్తుందిలే అనుకున్నాడు. కానీ నిమిషాలు గంటలవుతున్నాయి.. గంటలు రోజులుగా మారుతున్నాయి.. కానీ అతడి పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. రెండు రోజులైనా అది అలాగే ఉండిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురై వెంటనే ఆస్పత్రికి పరిగెట్టాడు. పోలారిస్ ను పరీక్షించిన వైద్యులు.. అతడు ప్రియాపిస్మ్ అనే రుగ్మతతో బాధపడుతున్నట్టు గుర్తించారు. దీనికి వెంటనే చికిత్స తీసుకోకుండే శాశ్వతంగా అతడి అంగం చచ్చుబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

చికిత్సలో భాగంగా పొలారిస్ నరకం అనుభవించాడు. ఎలాంటి మత్తు మందు ఇవ్వకుండా నేరుగా అతడి అంగంలోకి సూదులు గుచ్చి అందులోని రక్తాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించారు. దీంతో నొప్పి భరించలేక తాను పడిన బాధ వర్ణనాతీమని పొలారిస్ స్వయంగా పేర్కొన్నాడు. రెండు వారాలైనా అతడి సమస్య తీరలేదు. ఈలోగా దగ్గరున్న డబ్బులు మొత్తం అయిపోయాయి.

ఈ నేపథ్యంలో అతడి స్నేహితుడు గోఫండ్ మీ పేజ్ లో పొలారిస్ సమస్యను ప్రస్తావిస్తూ నిధుల సమీకరణ ప్రయత్నాలు ప్రారంభించాడు. ప్రస్తుతం పొలారిస్ ఆస్పత్రిలో చేరి మూడు వారాలు గడిచింది. ఇప్పుడిప్పుడే కాస్త ఫలితం కనిపిస్తోందని చెప్పాడు. ఈ వివరాలన్నింటినీ అతడు తన ఇన్ స్టాగ్రాంలో పంచుకున్నాడు. తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. తనలా ఎవరికీ కాకూడదని, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...