Switch to English

కర్ణాటక రెబెల్స్ పై వేటు.. అయినా బీజేపీకి ఢోకా లేదు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్. అనూహ్య నిర్ణయాలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన స్పీకర్ రమేష్ కుమార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ సర్కారుపై తిరుగుబాటు చేసి ప్రభుత్వ పతనానికి కారణమైన 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.

ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్.. తాజాగా కాంగ్రెస్ కు చెందిన 11 మంది, జేడీఎస్ కు చెందిన ముగ్గురిపై అనర్హత వేటు వేశారు. దీంతో ఇప్పటివరకు వేటు పడిన ఎమ్మెల్యేల సంఖ్య 17కి చేరింది. స్పీకర్ నిర్ణయం వెంటనే అమల్లోకి రావడంతో వారంతా వచ్చే ఎన్నికల వరకు పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. రెబెల్ ఎమ్మెల్యేల కారణంగా కుమారస్వామి సర్కారు కూలిపోయిన సంగతి తెలిసిందే. వారంతా విశ్వాస పరీక్ష రోజున సభకు గైర్హాజరు కావడంతో సభలో మేజిక్ ఫిగర్ 103కి తగ్గింది. దీంతో 105 మంది సభ్యులు కలిగిన బీజేపీ విశ్వాస పరీక్ష వీగిపోయేలా చేయడంలో సఫలీకృతమైంది.

అనంతరం కర్ణాటక కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బీఎస్ యడియూరప్ప.. సోమవారం కర్ణాటక విధాన సభలో తన బలం నిరూపించుకోనున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ రమేష్ కుమార్ రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. మరోవైపు సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ ఉంటుందని, సభ్యులంతా హాజరుకావాలంటూ స్పీకర్‌ ఆదేశాలు జారీచేశారు. రెబెల్స్ పై వేటు వేసినప్పటికీ బీజేపీ సర్కారుకు ఎలాంటి ఢోకా లేదు. 17 మంది సభ్యులపై అనర్హత వేటు వేయడంతో సభలో సభ్యుల సంఖ్య 208కి పడిపోయింది. నామినేటెడ్ ఎమ్మెల్యేని మినహాయిస్తే మేజిక్‌ ఫిగర్‌ 104కి చేరింది.

బీజేపీకి ప్రస్తుతం 105 మంది సభ్యుల మద్దతు ఉండగా.. ఓ స్వతంత్ర ఎమ్మెల్యే కూడా మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్షలో బీజేపీ సునాయాసంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు స్పీకర్ రమేష్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని బీజేపీ యోచిస్తోంది. ఆయన తనంతట తానుగా రాజీనామా చేయకపోతే తాము అవిశ్వాసం ప్రవేశపెడతామని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత వెల్లడించారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

ఎక్కువ చదివినవి

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....