Switch to English

ఏపీ మరో వెనెజులా అవుతుందట!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

వెనెజులా.. లాటిన్ అమెరికాలో అత్యంత ధనిక దేశంగా ఒకప్పుడు విరాజిల్లింది. కానీ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఎంతలా అంటే.. చిన్న రొట్టె ముక్క కోసం కొట్లాడుకునేలా, కుళ్లిన మాంసాన్ని తిని కడుపు నింపుకొనేలా, చదవుకునే బాలికలు సైతం వ్యభిచార కూపంలోకి దిగిపోయేలా అక్కడ దుర్భర పరిస్థితులు తాండవిస్తున్నాయి. ఇదంతా కేవలం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు తాయిలాలను పప్పుబెల్లాల్లా పంచిబెట్టినందుకే. త్వరలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇలాగే మారిపోయే ప్రమాదం ఉందట. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో ఈ మేరకు తన ఆందోళన వ్యక్తంచేశారు.

అభివృద్దిని విస్మరించి అంతులేని సంక్షేమం చేయడం ఎంతమాత్రం మంచిది కాదని సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆయన హితవు చెప్పారు. అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం సంక్షేమంపై ఆధారపడినంత మాత్రాన ఆశించిన రాజకీయ ప్రయోజనం నెరవేరదని.. అభివృద్ది, సంక్షేమం సమపాళ్లలో ఉన్నప్పుడే ప్రజలు సంతృప్తి చెందుతారని స్పష్టంచేశారు. ఆదాయాన్ని పెంచుకుంటూ సంక్షేమానికి కొంత వెచ్చిస్తే పర్వాలేదు కానీ, ఆదాయం పెంచే రాజధాని గురించి ఆలోచించకుండా ఉన్నదంతా సంక్షేమానికే ఖర్చు చేస్తే దాని దుష్పరిణామాలను భవిష్యత్తు తరాలు అనుభవించవలసి ఉంటుందని హెచ్చరించారు.

వాస్తవానికి రాధాకృష్ణ చెప్పిన విషయాలు నూటికి నూరుపాళ్లూ నిఖార్సైనవే. అవన్నీ ఆందోళన చెందాల్సిన అంశాలే. అయితే, ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎందుకు చెప్పలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైతు రుణమాఫీ దగ్గర నుంచి చంద్రన్న కానుకలు, ఎన్నికల ముందు పసుపు-కుంకుమ పేరుతో మహిళలకు డబ్బులు పంచినపెట్టినప్పుడు ఏపీ మరో వెనెజులా అయిపోతుందనే సంగతి ఆయనకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.

అసలే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని తెలిసి కూడా పార్టీ కార్యక్రమాలకు సైతం ప్రభుత్వ ధనాన్ని వెచ్చించినప్పుడు ఇలా ఎందుకు బాబుకు హితవు చెప్పలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీడియా ప్రతిపక్ష పాత్ర పోషించడం ఆహ్వానించతగ్గ పరిణామమే అని, అయితే ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే పని చేయాల్సి ఉంటుందని అంటున్నారు. అలా కాకుండా మన అనుకూల ప్రభుత్వం ఉంటే ఒకలా, వ్యతిరేక ప్రభుత్వం ఉంటే మరోలా వ్యవహరించడం సబబు కాదని చెబుతున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎక్కువ చదివినవి

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...