Switch to English

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండడం ఆసక్తికరమే.

గతంలో వంగా గీత, ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా, కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత ఆమె. ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుని, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు గనుక.. ఆయన మీద పోటీకి వంగా గీతను వైఎస్సార్సీపీ అధినాయకత్వం దింపింది.

అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి బ్రహ్మరథం పట్టేందుకు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. పవన్ కళ్యాణ్, ఇంకా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించకపోయినా, ‘లక్ష మెజార్టీ’ అన్న వాదన, స్థానిక జనసేన శ్రేణుల్లో వినిపిస్తోంది. ప్రజల నుంచీ అదే రెస్పాన్స్ వస్తోంది.

ఇంతకీ, ఎంపీ వంగా గీత పరిస్థితి ఏంటి.? పిఠాపురం వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా వంగా గీత ఎన్నికల ప్రచారంలో ఎలాంటి అనుభవాల్ని ఎదుర్కొంటున్నారు.? అంటే, ఎక్కడికి వెళ్ళినా వంగా గీతకు నిలదీతలు ఎదురవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి చెందిన నాయకుడే. సిట్టింగ్ ఎంపీ వంగా గీత కూడా వైసీపీ నాయకురాలే.

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ.. ఇద్దరూ కలిసి పిఠాపురంలో అభివృద్ధికి కృషి చేయలేదని జనం నిలదీస్తున్నారు. గుంతల రోడ్లు, తాగు నీటి సమస్య.. వంటి వాటి గురించి ఎంత మొత్తుకుంటున్నా అధికార వైసీపీ పట్టించుకోలేదనీ, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ అస్సలు తమను పట్టించుకోలేదని జనం వాపోతున్నారు.

‘నేను గెలిస్తే..’ అని వంగా గీత మాట్లాడేలోపు, ‘ఎంపీగానే పని చేస్తున్నారు కదా.? ఆ పదవిలో వుండి ఎందుకు చేయలేకపోయారు.?’ అని నిలదీస్తున్నారు జనం. అదీ, ఏకవచనంతో. దాంతో, వంగా గీత ఒకింత నొచ్చుకుంటున్నారు. రాయలసీమకి చెందిన వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కావొచ్చు, కాకినాడకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావొచ్చు.. చాలామంది నియోజకవర్గంలో వంగా గీతకు మద్దతుగా వ్యవహారాలు చక్కబెడుతున్నా, ఆమెకు అనుకూలంగా పరిస్థితులు అయితే మారడంలేదు.

‘నా నియోజకవర్గంలో ఇన్ని సమస్యలున్నాయా.?’ అని వంగా గీత సైతం ఆశ్చర్యపోతున్నా, పైకి ఎక్స్‌ప్రెషన్ తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మీదా, సిట్టింగ్ ఎంపీ మీదా విపరీతమైన వ్యతిరేకత పిఠాపురంలో, కాకినాడ లోక్ సభ పరిధిలో కనిపిస్తోంది. వైసీపీ మీదా, వైసీపీ ప్రభుత్వం మీదా వున్న ఇంతటి వ్యతిరేకత, పిఠాపురంలో కూటమికి కలిసొచ్చే అంశమే.

అందుకే, టిక్కెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మని తమవైపుకు తిప్పుకునేందుకు వైసీపీ నానా రకాల ప్రయత్నాలూ చేసి చతికిలపడింది. స్థానికంగా వైసీపీ పట్ల వున్న వ్యతిరేకత నేపథ్యంలో వర్మ కూడా జాగ్రత్తపడ్డారు. పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమనీ, ఆ గెలుపులో భాగం తీసుకునే అవకాశాన్ని తానెలా వదులుకుంటాననీ, సన్నిహితుల వద్ద చెబుతున్నారట వర్మ.

ఇదీ పిఠాపురంలో తాజా పరిస్థితి. ఎన్నికల్లోపు వైసీపీకి అనుకూలంగా ఎలాంటి అద్భుతాలూ జరిగే అవకాశం లేదు. మరింతగా వైసీపీ పరిస్థితి అక్కడ దిగజారిపోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...