Switch to English

వైనాట్ 175 అటకెక్కింది.! ఓన్లీ పిఠాపురం చుట్టూ వైసీపీ గింగరాలు తిరుగుతోంది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,438FansLike
57,764FollowersFollow

అదేంటీ, వైనాట్ 175 అన్నారు కదా.. ఇప్పుడేంటి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ అంతా, పిఠాపురం నియోజకవర్గం చుట్టూనే తిరగడం.? ఔను, వైసీపీ అధినాయకత్వం పూర్తిగా పిఠాపురం మీదనే ఫోకస్ పెట్టింది. వైసీపీకి చెందిన కీలక నేతలు, తమకు అప్పగించిన బాధ్యతల్లో నిమగ్నమయ్యారా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, అందరూ పిఠాపురం గురించే మాట్లాడుతున్నారు.

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారన్నది వైసీపీ వాదన. పిఠాపురంలోనేమో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బంపర్ విక్టరీ సాధిస్తారంటూ స్థానికంగా ప్రజలు అభిప్రాయపడుతున్నారాయె.! మంత్రులు, ఇతర ముఖ్య నేతలంతా వైసీపీ తరఫున పిఠాపురంలోనే మోహరిస్తున్నారు. ఇదంతా దేనికి.? ఇంకెందుకు, పవన్ కళ్యాణ్‌ని ఓడించడం కోసం.

జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనగానే, వైసీపీలో అలజడి షురూ అయ్యింది. మండల స్థాయిలో కాదు, గ్రామ స్థాయిలోనూ అనధికారికంగా ఇన్‌ఛార్జిల నియామకం జరుగుతోంది. వార్డుల వారీగా కూడా వైసీపీ ముఖ్య నేతలు పిఠాపురంలో మోహరించబోతున్నారంటే, ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకేముంటుంది.?

‘డబ్బు ఎంత ఖర్చయినా ఫర్లేదు.. వైసీపీ గెలవాల్సిందే..’ అనే పట్టుదలతో వైసీపీ అధినాయకత్వం వుందిట పిఠాపురంలో. ఇంత ఫోకస్ పిఠాపురంలో పెట్టాల్సిన అవసరం ఏముంది.? అంటే, ఏ రాజకీయ పార్టీకి అయినా ప్రతి నియోజకవర్గమూ ముఖ్యమే.. అని సరిపెట్టుకోవడానికి వీల్లేదు.

పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళకూడదు.. ఇదీ వైసీపీ నినాదం. కానీ, మిగతా నియోజకవర్గాల సంగతేంటి.? పిఠాపురం మీదనే వైసీపీ పెడుతున్న అదనపు ఫోకస్, ఇతర నియోజకవర్గాల్లో ఆ పార్టీకి నిలువ నీడ లేకుండా పోవడానికి కారణమవుతుందేమోనన్న చర్చ కూడా జరుగుతోంది.

ఔను మరి, పిఠాపురంలో గెలిచేందుకు వైసీపీ వేస్తున్న వెకిలి వేషాల గురించి రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. వై నాట్ 175 అనేది మేకపోతు గాంభీర్యమే.. వైసీపీ కేవలం పిఠాపురంకే పరిమితమవుతోంది.. అని జనం చెవులు కొరుక్కునే పరిస్థితి వచ్చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌...

రాజకీయం

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఎక్కువ చదివినవి

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...