Switch to English

‘ది వారియర్’ ప్రేక్షకులకు నచ్చుతుంది.. కథ విని ఎగ్జైట్ అయ్యా: కృతి శెట్టి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

యువ హీరో రామ్ పోతినేని ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమా ‘ది వారియర్’. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో చిత్రం తెరకెక్కింది. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలో విజిల్ మహాలక్ష్మి పాత్రలో నటించిన కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో చిత్ర అనుభవాలను పంచుకున్నారు.

రామ్ ఎనర్జీ సూపర్బ్..

‘ది‌ వారియర్’ సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ రియాక్షన్ చూసి నేను విజిల్స్ వేయడం పక్కా. హీరో రామ్ ఎనర్జీ మ్యాచ్ చేయడం కష్టమని నెర్వస్ ఫీలయ్యా. రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, ‘రెడీ’, ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలు చూశా. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు రామ్ ఎనర్జీ మ్యాచ్ చేయడానికి నెర్వస్ ఫీలయ్యాను. కానీ, షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. క్లాస్ అయితే ‘విజిల్…’ సాంగ్.. కొంచెం స్టయిలిష్ అంటే ‘బుల్లెట్…’ సాంగ్.

ఆర్జే వీడియోస్ చూసి చూశా..

సినిమాలో నా పాత్ర అందరూ ప్రేమించేలా ఉంటుంది. గాళ్ నెక్స్ట్ డోర్, క్యూట్ రోల్. సినిమా చూసినప్పుడు మన ఇంట్లో అమ్మాయి లేదా పక్కింటి అమ్మాయి అనుకుంటారు. నా క్యారెక్టర్ పేరు విజిల్ మహాలక్ష్మి. ఆ అమ్మాయి ఆర్జే. మా పెయిర్ బావుందని అంటున్నారు. సీన్స్ కూడా బావుంటాయి. పోలీస్ స్టేషన్, రేడియో స్టేషన్… మధ్యలోని రైల్వే స్టేషన్‌ ఇలా సాగుతుంది. తెలుగు ఆర్జే వీడియోస్ చాలా చూశా. వాయిస్ వినిపించినప్పుడు ఆర్జే కనిపించకపోయినా.. ఎక్స్‌ప్రెష‌న్‌ ఫీల్ అవ్వాలి. ఫారిన్ ఆర్జే వీడియోస్ చూశా. పాడ్ కాస్ట్ వీడియోస్ చూసి ప్రిపేర్ అయ్యాను.

కథ విని ఎగ్జైట్ అయ్యా..

దర్శకుడు లింగుస్వామికి ఏం కావాలో స్పష్టంగా తెలుసు. కొన్నిసార్లు ఎలా నటించాలో చేసి చూపిస్తారు. వాయిస్ మాడ్యులేషన్ కూడా చేశారు. లింగుస్వామి ‘ఆవారా’ను తమిళంలో చాలాసార్లు చూశా. ఆయన ఫోన్ చేశారని అమ్మ చెప్పినప్పుడు చాలా సంతోషించాను. ఆయన సినిమాలు ఎంట‌ర్‌టైనింగ్‌గా.. పెర్ఫార్మన్స్‌కు అవకాశం ఉంటుంది. ది వారియర్ కథ విన్నప్పుడు ఎంతో ఎగ్జైట్ అయ్యాను. ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. బయట సాఫ్ట్‌గా ఉండే ఆయన.. విలన్ రోల్‌లో అద్భుతంగా నటించారు.

తమిళం నేర్చుకుంటున్నా..

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్లో వరుసగా రెండు సినిమాలు చేయడం సంతోషంగా ఉంది. నిర్మాత శ్రీనివాస్ చిట్టూరికి సినిమా అంటే ప్రేమ. ది వారియర్ బైలింగ్వల్ సినిమా. తమిళ్ లో ఎంట్రీ కావడంపై సంతోషంగా ఉంది. తమిళ ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ‘ఉప్పెన’కు కోలివుడ్, తమిళ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. అంత ప్రేమను ఊహించలేదు. ఇప్పుడు సూర్య గారితో మరో తమిళ సినిమా.. నాగచైతన్య, వెంకట్ ప్రభు సినిమా చేస్తున్నా. అదీ తెలుగు-తమిళ్ బైలింగ్వల్. ఇప్పుడు తమిళం నేర్చుకుంటున్నా. ‘ది వారియర్’ తర్వాత ‘మాచర్ల నియోజకవర్గం’తో ప్రేక్షకుల ముందుకు వస్తా.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...