“జార్జ్ రెడ్డి” చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అభయ్ బేతిగంటి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘రామన్న యూత్’. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజినీ నిర్మించారు. సినిమా ఫస్ట్ లుక్ ను నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… ‘రామన్న యూత్ ఫస్ట్ లుక్ బాగుంది. అభయ్ మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. కొత్త కాన్సెప్ట్ తో ఆయన తెరకెక్కించిన సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. అభయ్ కు, చిత్రబృందానికి బెస్ట్ విషెస్’ అన్నారు.
ఓ యువకుడు రాజకీయ నాయకుడిగా ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయనేది చిత్ర కథాంశం. వినోదంతో పాటు ఆలోచింపజేసే నేటి సామాజిక విషయాలు సినిమాలో ఉండబోతున్నాయి. రొటీన్ కు భిన్నమైన కొత్త తరహా కథతో సినిమాగా తెరకెక్కించారని తెలుస్తోంది. సినిమాలో యూత్ లీడర్ రాజు పాత్రలో అభయ్ బేతిగంటి నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘రామన్న యూత్’ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
సినిమాలో ఇతర పాత్రల్లో.. అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్, వేణు పొలసాని తదితరులు నటించారు.
సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ – అశ్వంత్ బైరి, సౌండ్ డిజైన్ – నాగార్జున తాళ్లపల్లి, ఎడిటర్ – రూపక్ రొనాల్డ్ సన్, అభయ్, ఆర్ట్ – లక్ష్మీ సింధూజ, సంగీతం – కమ్రాన్ , సినిమాటోగ్రఫీ – ఫహాద్ అబ్దుల్ మజీద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ ఎంఎస్ కే, పీఆర్వో – జీఎస్కే మీడియా, రచన దర్శకత్వం – అభయ్ బేతిగంటి.