Switch to English

ఒంగోలు రాజకీయం.! అసలేం జరుగుతోందక్కడ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,438FansLike
57,764FollowersFollow

కొన్నాళ్ళ క్రితం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కొట్టుకున్నారు. ఓ వర్గం అనుచరులు, ఇంకో వర్గం అనుచరుడ్ని లాడ్జిలో పట్టుకుని, చితక్కొట్టి.. వీడియో కాల్ ద్వారా ‘క్షమాపణ’ చెప్పించారు.. తమ నాయకుడికి. ఆ తర్వాత ఆ వివాదాన్ని ‘కామప్’ చేసేసింది అధికార వైసీపీ. చివరికి బాధితుడు, పార్టీ నుంచి బయటకు వచ్చేయక తప్పలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇదో సరికొత్త రాజకీయ రౌడీయిజం. రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యలూ ఇలాగే వుంటున్నాయ్. వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని, ప్రత్యర్థుల్ని, ప్రత్యర్థులుగా భావిస్తున్నవారినీ కిడ్నాప్ చేసి, చావ చితక్కొట్టి, వీడియో కాల్ ద్వారా క్షమాపణలు చెప్పిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయ్.

సాక్షాత్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, తనను ఏపీ సీఐడీ కిడ్నాప్ చేసి, చితక్కొట్టి.. పార్టీ పెద్దలకు ఆ వ్యవహారాన్నంతా వీడియో కాల్‌లో చూపిస్తే, ఆ పెద్దలు పైశాచికానందం పొందారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదీ ఇలా తయారైంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం.

ఒంగోలు విషయానికొద్దాం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడొకరు, జనసేన మహిళా నేత రాయపాటి అరుణపై బెదిరింపులకు దిగారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు, స్పష్టమైన వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఇంతలోనే, అనూహ్యంగా సీన్ మారింది. రాయపాటి అరుణకి, వైసీపీ నేత క్షమాపణలు చెప్పాడు.

అధికారం తమ చేతుల్లో వుంది గనుక, ఎవర్నయినా బెదిరిస్తామంటే ఎలా.? కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది అదే. చిత్రమేంటంటే, ఇలాంటి సంఘటనల్లో బాధితుల మీద పోలీస్ కేసులు నమోదవుతుండడం. ఈ కారణంగానే పోలీసు వ్యవస్థపై ప్రతిసారీ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు, న్యాయస్థానాల్లో పోలీస్ వ్యవస్థ చీవాట్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది.

కాగా, మంత్రి పదవి పోయినా.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగడాలు ఒంగోలులో ఆగలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా కనిపిస్తోంది. పైగా, బెదిరింపు రాజకీయాల్లో బాలినేని ఆరితేరిపోయారనీ, సొంత పార్టీ నేతల్ని సైతం బెదిరింపులకు గురిచేస్తున్న బాలినేని అనుచరులు, విపక్షాల్ని వదిలిపెడతారా.? అన్న వాదన బలంగా వినిపిస్తున్నా, పోలీసు వ్యవస్థ తగిన చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌...

రాజకీయం

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఎక్కువ చదివినవి

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...