కొన్నాళ్ళ క్రితం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కొట్టుకున్నారు. ఓ వర్గం అనుచరులు, ఇంకో వర్గం అనుచరుడ్ని లాడ్జిలో పట్టుకుని, చితక్కొట్టి.. వీడియో కాల్ ద్వారా ‘క్షమాపణ’ చెప్పించారు.. తమ నాయకుడికి. ఆ తర్వాత ఆ వివాదాన్ని ‘కామప్’ చేసేసింది అధికార వైసీపీ. చివరికి బాధితుడు, పార్టీ నుంచి బయటకు వచ్చేయక తప్పలేదు.
ఆంధ్రప్రదేశ్లో ఇదో సరికొత్త రాజకీయ రౌడీయిజం. రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యలూ ఇలాగే వుంటున్నాయ్. వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని, ప్రత్యర్థుల్ని, ప్రత్యర్థులుగా భావిస్తున్నవారినీ కిడ్నాప్ చేసి, చావ చితక్కొట్టి, వీడియో కాల్ ద్వారా క్షమాపణలు చెప్పిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయ్.
సాక్షాత్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, తనను ఏపీ సీఐడీ కిడ్నాప్ చేసి, చితక్కొట్టి.. పార్టీ పెద్దలకు ఆ వ్యవహారాన్నంతా వీడియో కాల్లో చూపిస్తే, ఆ పెద్దలు పైశాచికానందం పొందారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదీ ఇలా తయారైంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం.
ఒంగోలు విషయానికొద్దాం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడొకరు, జనసేన మహిళా నేత రాయపాటి అరుణపై బెదిరింపులకు దిగారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు, స్పష్టమైన వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఇంతలోనే, అనూహ్యంగా సీన్ మారింది. రాయపాటి అరుణకి, వైసీపీ నేత క్షమాపణలు చెప్పాడు.
అధికారం తమ చేతుల్లో వుంది గనుక, ఎవర్నయినా బెదిరిస్తామంటే ఎలా.? కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది అదే. చిత్రమేంటంటే, ఇలాంటి సంఘటనల్లో బాధితుల మీద పోలీస్ కేసులు నమోదవుతుండడం. ఈ కారణంగానే పోలీసు వ్యవస్థపై ప్రతిసారీ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు, న్యాయస్థానాల్లో పోలీస్ వ్యవస్థ చీవాట్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది.
కాగా, మంత్రి పదవి పోయినా.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగడాలు ఒంగోలులో ఆగలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా కనిపిస్తోంది. పైగా, బెదిరింపు రాజకీయాల్లో బాలినేని ఆరితేరిపోయారనీ, సొంత పార్టీ నేతల్ని సైతం బెదిరింపులకు గురిచేస్తున్న బాలినేని అనుచరులు, విపక్షాల్ని వదిలిపెడతారా.? అన్న వాదన బలంగా వినిపిస్తున్నా, పోలీసు వ్యవస్థ తగిన చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం.
169161 892779This internet internet site may be a walk-through for all with the details you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll certainly discover it. 883698
575291 115047Wow! This can be 1 specific with the most useful blogs We have ever arrive across on this topic. In fact Fantastic. Im also an expert in this subject so I can understand your hard function. 381562