Switch to English

ఆత్మకూరు ఉప ఎన్నికలో గెలిచిన విక్రమ్ రెడ్డి.! అయితే ఏంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలోకి దిగలేదు. జనసేన పార్టీ కూడా పోటీ చెయ్యలేదు. బీజేపీ మాత్రం బరిలో నిలిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరిగింది. అధికార వైసీపీ, ఇక్కడ అవలీలగా గెలిచేస్తుందని అందరికీ తెలుసు.

కారణం, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివాద రహితుడు, అజాత శతృవు. గుండె పోటుతో అకాలమరణం చెందారు.. అదీ మంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే. ఈ నేపథ్యంలో గౌతమ్ రెడ్డి కుటుంబం పట్ల సానుభూతి వుంటుంది. స్వాయానా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. గెలిచారు కూడా.!

‘బంపర్ మెజార్టీతో గెలిచాం.. ఇదీ మా సత్తా..’ అంటోంది వైసీపీ, విక్రమ్ రెడ్డి గెలుపు నేపథ్యంలో. గెలిచి, వైసీపీ అదనంగా సాధించేదేముంది.? ‘మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి.. ఇవే మమ్మల్ని గెలిపించాయి..’ అని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక కేవలం ‘సానుభూతి’ కోణంలోనే జరిగింది. బీజేపీకి దాదాపు ఇరవై వేల ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి, బీజేపీకి అన్ని ఓట్లు రావడమంటే అది విశేషమే. కానీ, డిపాజిట్ రాలేదంటూ వైసీపీ ఎగతాళి చేస్తోంది. బీజేపీ – వైసీపీ మధ్య తెరవెనుకాల వున్న అవగాహన గురించి కొత్తగా చెప్పేదేముంది.?

ఏపీ బీజేపీ, వైసీపీ మీద గుస్సా అవుతుటుంది.. ఢిల్లీలో మాత్రం బీజేపీకి, వైసీపీ ‘గులాం గిరీ’ చేస్తుంటుంది. సో, అసలు ఆత్మకూరు ఉప ఎన్నికలో ‘పోటీ’ అన్న మాటకే అర్థం లేదు. బీజేపీ టైమ్ పాస్ చేసింది. వైసీపీ మాత్రం కిందా మీదా పడింది. చాలామంది మంత్రులు ఆత్మకూరులో మోహరించారు. ఓటుకి రెండు వేల రూపాయల దాకా అధికార పార్టీ ఖర్చు చేసింది. నిజానికి, ఇలా డబ్బులు పంచడమంటే, గౌతమ్ రెడ్డిని అవమానించడమే.

అందుకేనేమో, ఆత్మకూరు ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదయ్యింది. అయినా, అధికార పార్టీ అహంకారం రెట్టింపయ్యిందే తప్ప తగ్గడంలేదు. తగ్గితే, అది వైసీపీ ఎందుకు అవుతుంది.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...