Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 23 జనవరి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ 6:38
సూర్యాస్తమయం : సా‌.5:46
తిథి: పుష్య బహుళ పంచమి ఉ.7:12 వరకు తదుపరి షష్ఠి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము : ఉత్తర ఉ.9:37 వరకు తదుపరి హస్త
కరణం: తైతుల ఉ.7:12 వరకు తదుపరి గరజి
యోగం: అతిగండ మ.11:42 వరకు తదుపరి సుకర్మ
వర్జ్యం: సా.5:54 నుండి రా.7:28వరకు
దుర్ముహూర్తం.సా.4:13నుండి 4:57 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం :మ.3:15 నుండి సా.4:39 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:17నుండి ఉ .6:05 వరకు
అమృతఘడియలు: ‌రా.తె.3:21 నుండి 4:55వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:05 నుండి 12:50

ఈరోజు (23-01-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు.

వృషభం: చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మిథునం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు.

కర్కాటకం; నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. విలువైన గృహాపకరణాలు బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

సింహం; కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.ధనపరంగా ఇబ్బందులు తప్పవు.కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

కన్య: భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

తుల: చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

వృశ్చికం: వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు రాగలవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు: సంతానానికి విద్య ఉద్యోగ అవకాశములు అందుతాయి.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరువుతారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

మకరం: కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. దూరప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

కుంభం: చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుటుంబసభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మీనం: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇతరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

ఎక్కువ చదివినవి

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...