Switch to English

వైద్య శాస్త్రంలో అద్భుతం..! మనిషికి పంది గుండె అమర్చిన వైద్యలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

నేడు అవయువ దానం ద్వారా ఎందరికో ప్రాణాలు నిలుస్తున్నాయి. అవయువ దానంపై అవగాహన కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అయితే.. ఇక్కడ జరిగిన అవయువ దానం ద్వారా వైద్య శాస్త్రంలో చారిత్రక ఘట్టం లిఖించినట్టైంది. మనిషికి పంది గుండెను విజయవంతంగా అమర్చడం ద్వారా చరిత్ర సృష్టించారు అమెరికన్ వైద్యులు. ఇకపై అవయువ దానం కొత్త పుంతలు తొక్కనుందనే చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని బాల్టిమోర్‌ ‘మేరీలాండ్‌ మెడికల్‌ స్కూల్‌ ఆస్పత్రిలో జనవరి 7న ఈ అద్భుతం జరిగింది.

పంది నుంచి సేకరించిన గుండెను మనిషికి అమర్చడం.. ఆపరేషన్ విజయవంతం కావడం.. జరిగింది. ఆపరేషన్ వియయవంతం అయిన నేపథ్యంలో ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర అనుమతులు జారీ చేయడంతో జన్యుపరంగా మార్పు చేసిన పంది గుండెను మనిషికి అమర్చామని వైద్యులు ప్రకటించారు. అమెరికాకే చెందిన డేవిడ్ బెన్నెట్ (57)కు ఈ గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. సహజంగా జరిగే గుండె మార్పిడికి పేషెంట్ పరిస్థితి సహకరించలేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.

వైద్య శాస్త్రంలో అద్భుతం..! మనిషికి పంది గుండె అమర్చిన వైద్యలు

ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్న డేవిడ్ కోలుకుంటున్నాడని.. పూర్తిగా కోలుకుంటే వైద్య శాస్త్రంలో ఇదొక అద్భుతమే అవుతుందని అంటున్నారు. తద్వారా భవిష్యత్ లో అవయువ దానం సమస్యకు ఇదొక పరిష్కార మార్గం అవుతుందని వైద్యులు అంటున్నారు. అమెరికాలో అవయువాల కొరత ఎక్కువగా ఉందని.. సగటున ఏడాదికి గుండె సమస్యకు పరిష్కారం లేక 6వేల మంది చనిపోతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. ప్రస్తుతం గుండె మార్పిడి కోసం లక్షకు పైగా పేషెంట్లు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. వీరందరికీ డేవిడ్ దిక్సూచీలా కనిపిస్తున్నాడు.

గతేడాది లైఫ్ సపోర్ట్ పై ఉన్న ఓ వ్యక్తికి న్యూయార్క్‌ యూనివర్సిటీ లాన్‌గోన్ హెల్త్ మెడికల్ సెంటర్‌లో పంది కిడ్నీని అమర్చగా ఆ ఆపరేషన్ కూడా విజయవంతమైంది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. 1984లోనే కోతి జాతికి చెందిన బబూన్ గుండెను ఓ శిశువుకు అమర్చారు. అప్పట్లో ఆ ఆపరేషన్ విజయవంతమైనా.. ఆ చిన్నారి కేవలం 20 రోజులే జీవించింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...