Switch to English

మోదీ నిబంధన ఆయన్నే ముంచేలా ఉందే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తొలిసారి పగ్గాలు చేపట్టినప్పుడు ఆయన వయసు 64 ఏళ్లు. పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తిగా చేతుల్లోకి తీసుకున్న తర్వాత కొంతమందిని దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిసి ఓ నిబంధన తీసుకొచ్చారు. 75 ఏళ్లు పైబడిన రాజకీయ నాయకులు ప్రభుత్వంలోగానీ, పార్టీలోగానీ కీలకమైన పదవులకు దూరంగా ఉండాలన్నది ఆ రూల్. ఈ నిబంధనను ఇద్దరూ కలిసి ప్రతిపాదించడం, ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఫలితంగా పార్టీ సీనియర్లు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలకు ప్రభుత్వంలోగానీ, పార్టీలో గానీ ఎలాంటి పదవులూ ఇవ్వలేదు. కీలక పదవుల్లో ఉన్న కొంతమంది చేత రాజీనామా కూడా చేయించారు. అప్పటి నుంచీ ఈ నిబంధనను చాలా కచ్చితంగా అమలు చేస్తున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం కొంతమందిని ఇదే కారణంతో పోటీకి సైతం నిలపలేదు. 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ కొంతమంది పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి, ప్రధాని కావాలంటే ఏం చేయాలని అడగ్గా.. మరో 20 ఏళ్ల పాటు నీకు ఆ అవకాశం లేదని, ఈ 20 ఏళ్లపాటు తానే ప్రధానిగా ఉంటాను కాబట్టి, నువ్వు 20 ఏళ్ల తర్వాత ప్రయత్నాలు చేయాలని ఆ విద్యార్థికి సూచించారు. అంటే తనకు 84 ఏళ్లు వచ్చినా, ప్రధాని పదవిలో కొనసాగుతానని అప్పట్లో పేర్కొన్నారు. అంటే.. తాను తీసుకొచ్చిన నిబంధన మరచిపోయి అలా చెప్పారో లేక ఆ నిబంధన తనకు వర్తించదన్న ఉద్దేశంతో చెప్పారో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

అయితే, కొంతమందిని దూరంగా ఉంచేందుకు తీసుకొచ్చిన ఈ నిబంధనే మోదీకి ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని మోజార్టీ సాధించిన నరేంద్ర మోదీ.. రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన వయసు 69 సంవత్సరాలు. ఈ టెర్మ్ పదవీకాలం పూర్తయ్యే సరికి మోదీకి 74 ఏళ్లు వస్తాయి. 2024లో కూడా ఒకవేళ బీజేపీయే అధికారంలోకి వస్తే మోదీ ప్రధాని పదవి చేపట్టడానికి అర్హులు కాదు. అంటే.. ఆయన తీసుకొచ్చిన నిబంధనే ఆయనకు అడ్డంకిగా మారనుందన్న మాట. ఈ పరిస్థితి రావడానికి ఇంకా ఐదేళ్ల సమయం ఉన్నప్పటికీ, దీనిపై అప్పుడే చర్చ జరుగుతోంది.

ఒకవేళ ఈ నిబంధనకు కట్టుబడి మోదీ ప్రధాని పదవి చేపట్టకపోతే అప్పుడు అవకాశం ఎవరికి వస్తుందనే అంశంపైనా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ విషయంలో రెండో మాటకు తావు లేకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకే ప్రధాని పీఠం దక్కుతుందని అంటున్నారు. ప్రస్తుతం షా వయసు 55 ఏళ్లు కావడమే ఇందుకు అనుకూలమైన అంశమని చెబుతున్నారు. ఇవన్నీ ఆలోచించే, అనుభవం కోసం ప్రస్తుతం ఆయన్ను కేంద్ర హోంమంత్రిగా చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2024లో కూడా బీజేపీదే విజయం అయిన పక్షంలో అమిత్ షా ప్రధాని అవుతారా లేక తాము తీసుకొచ్చిన నిబంధనను మోదీ, షా ద్వయం సవరించేస్తారా అన్నది ఇప్పుడే చెప్పలేం. రాజు తలుచుకుంటే కానిదేముంటుంది?

Related Posts

ప్రత్యేక హోదా ‘మచ్చ’ చెరిపేసుకోనున్న మోడీ!

జగన్‌కి వ్యతిరేకంగా ‘స్కెచ్‌’ రెడీ చేస్తున్న మోడీ

మోడీకి వంగి వంగి దండాలెట్టాలా వైఎస్‌ జగనూ!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...