Switch to English

సన్నీలియోన్‌తో సునీల్‌ ‘చీకట్లో చితక్కొట్టుడు’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

పాపం సునీల్‌, స్టార్‌ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగి, హీరోగా మారి సక్సెస్‌లు కొట్టి, ఆ తర్వాత ఫ్లాపులు రావడంతో తిరిగి కమెడియన్‌గా మారేందుకు చాలా టైమ్‌ తీసుకుని, ఇప్పుడెలాంటి సినిమాలు చేయాలో తెలియక అయోమయంలో వున్నాడు. సరిగ్గా ఈ టైమ్‌లో సునీల్‌కి బంపర్‌ ఆఫర్‌ వచ్చిందట. అదేంటో తెలుసా? పోర్న్‌ స్టార్‌ సన్నీలియోన్‌తో రొమాన్స్‌ చేసే అవకాశం, అది కూడా బాలీవుడ్‌లో. నమ్మశక్యంగా లేని ఆఫర్‌ ఇది. కానీ, ఇది నిజమేనట.

తాతినేని ప్రసాద్‌ అనే దర్శకుడు తెరకెక్కించనున్న ఓ థ్రిల్లర్‌ మూవీలో సునీల్‌ నటించబోతున్నాడు. ఇది హిందీలోనూ, తెలుగులోనూ ఏకకాలంలో రూపొందుతుందట. సన్నీలియోన్‌ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. మరో సీనియర్‌ కమెడియన్‌ బ్రహ్మానందం కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడనే ప్రచారం జరుగుతున్నా, పూర్తి స్పష్టత రావాల్సి వుంది.

తెలుగులో ఈ మధ్య అడల్ట్‌ కామెడీ సినిమాలు ఎక్కువైపోయాయి. థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందే కామెడీ సినిమాల్లోనూ అడల్‌ కంటెంట్‌నే చూస్తున్నాం. మనోళ్ళకి ఇది కొత్తేమోగానీ, బాలీవుడ్‌కి కొత్త కాదు కదా! తెలుగులో ఈ మధ్యనే ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ అనే సినిమా వచ్చింది గుర్తుందా? థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే అడల్ట్‌ కామెడీ సినిమా ఇది. అచ్చం ఇదే తరహాలో సునీల్‌, సన్నీలియోన్‌ చేయబోయే సినిమా వుంటుందట. సన్నీలియోన్‌ సినిమాలో ఏముంటాయో అందరికీ తెలుసు. ఒకప్పటి ఈ పోర్న్‌ స్టార్‌ని బాలీవుడ్‌ ఓ రేంజ్‌లో వాడేసింది.. అదేనండీ, అందాల ప్రదర్శన పరంగా. అయినాగానీ, సన్నీలియోన్‌ అందానికి వున్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.

ఈ నేపథ్యంలోనే భారీ బడ్జెట్‌తో సన్నీలియోన్‌ ప్రధాన పాత్రలో అడల్ట్‌ థ్రిల్లర్‌ కామెడీకి ప్లాన్‌ చేశారట. తొలుత ఈ సినిమా కోసం ఓ బాలీవుడ్‌ నటుడ్ని అనుకున్నా, ఆ తర్వాత ఆ ఛాన్స్‌ సునీల్‌కి దక్కినట్లు తెలుస్తోంది. సునీల్‌ కామెడీ అంటే చాలా ఆరోగ్యకరంగా వుంటుంది. వల్గర్‌ కామెడీ చాలా చాలా అరుదు సునీల్‌ విషయంలో. అలాంటిది, బాలీవుడ్‌ ఛాన్స్‌ కోసం సునీల్‌ అడల్ట్‌ కామెడీకి ఓకే చేసేశాడంటే నమ్మగలమా.? నమ్మాల్సిందేనంటున్నారు. మరి, సునీల్‌ ఈ గాసిప్స్‌పై ఏమంటాడో వేచి చూడాల్సిందే.

Related Posts

విద్య బాలన్ హాట్ ఫొటోస్

నాగ శౌర్య ఆ విషయంలో వీక్ అంటున్న హీరోయిన్ ?

సాహో ట్రైలర్ వచ్చేస్తోంది

పెళ్ళి గురించి తాప్సి షాకింగ్ కామెంట్స్

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.. రామ్ చరణ్

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి అబ్బాయి అనేకంటే.. ఈ అబ్బాయి తండ్రి...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...