గుంతల రోడ్డుపై బస్సు.! అందులో గొడుగులతో ప్రయాణం.!రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలా నాయనా.? అయితే, గుంతల రోడ్డులో ప్రయాణించి, కుదిరితే నడుం విరగ్గొట్టుకోండి.. వీలైతే ప్రాణాలు కూడా పోగొట్టుకోండి. మీ అదృష్టం బావుంటే, ఆ గుంతల రోడ్డు మీద బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు.. వర్షం కురవనూ వచ్చు.. కాబట్టి, మీ వెంట ఓ గొడుగు కూడా తీసుకెళ్ళండి.. ఎందుకంటే, బస్సులోనే మిమ్మల్ని వర్షపు నీటిలో తడిపేందుకు తగిన ఏర్పాట్లున్నాయ్.!
సంక్షేమ పథకాల కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఔను, నిజంగానే ఖర్చు చేస్తున్నారు. ఓ రెండు మూడు వేల కోట్లు ఖర్చు చేస్తే, రాష్ట్రంలో వున్న గుంతల రోడ్లు బాగైపోతాయ్ కదా.? ఇంకా నయ్యం, అలా చేస్తే.. రోడ్ల మీద వెళ్ళేవారికి ఉయ్యాలాటలు, బస్సుల్లోనే సెలయేళ్ళు ఎలా సాధ్యమవుతాయ్.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్ల మీద వెళ్ళి జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు తప్ప, ఎందుకీ రోడ్ల దుస్థితి.? అని ప్రజా ప్రతినిథుల్ని నిలదీయడంలేదు. నిజంగానే నిలదీయడంలేదా.? నిలదీస్తున్నవాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపిస్తున్నారా.? అన్నదానిపై మళ్ళీ భిన్నవాదనలున్నాయ్. రోడ్ల తీరుతో విసుగు చెంది, తమవంతుగా రోడ్లను బాగు చేయించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే, అలాంటివారిపై కేసులు పెడుతున్న సందర్భాల్ని చూస్తున్నాం మరి.!
ప్రతిసారీ.. అంటే, ముఖ్యమంత్రి రోడ్ల దుస్థితిపై సమీక్షించినప్పుడల్లా డెడ్లైన్లు పెడుతుంటారు అధికారులకి. కానీ, రోడ్ల మీద గుంతలు ఏడాదికేడాది ఇంకా పెద్దవవుతున్నాయ్ తప్ప తగ్గడంలేదు. రహదార్లపై ఆర్టీసీ బస్సులు చక్రాలు ఊడగొట్టుకుంటున్నాయ్.. గోతుల్లో దిగబడిపోతున్నాయ్. ఆర్టీసీ బస్సుని ప్రగతి రధ చక్రంగా అభివర్ణిస్తుంటారు. అసలంటూ రాష్ట్రానికి అభివృద్ధి అనే కోణంలో ప్రగతి అవసరం లేదు గనుక, ప్రగతి రధ చక్రాలు ఊడిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నమాట. ఈ రోడ్లలో మేం బస్సుల్ని నడిపించలేం.. అని గట్టిగా చెప్పే పరిస్థితి ఆర్టీసీ సిబ్బందికీ లేకుండా పోతోంది.
అయినా, బస్సుల్లో గొడుగులేసుకెళ్ళడమేంటి ఖర్మ కాకపోతే.? ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్.! పుసుకున్న ఫ్యాక్ట్ చెక్.. అంటూ ‘అదంతా ఉత్తదే’ అన్న ప్రకటనలు ఇచ్చినా ఇచ్చేస్తారు. ప్రజల్ని మభ్యపెట్టడం బాగా అలవాటైపోయింది కదా.! ఒక్క రాజధానికే ‘ఓపిక’ లేనోడు, మూడు రాజధానులెలా కడతాడు.? అసలంటూ రోడ్లనే బాగు చేయలేనోడు, రాష్ట్రాన్నెలా పరిపాలిస్తాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు మామూలుగా పేలడంలేదు.
355607 659532Just wanna comment which you have a extremely nice internet site, I the style and style it truly stands out. 56364