Switch to English

గుంతల రోడ్డుపై బస్సు.! అందులో గొడుగులతో ప్రయాణం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

గుంతల రోడ్డుపై బస్సు.! అందులో గొడుగులతో ప్రయాణం.!రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలా నాయనా.? అయితే, గుంతల రోడ్డులో ప్రయాణించి, కుదిరితే నడుం విరగ్గొట్టుకోండి.. వీలైతే ప్రాణాలు కూడా పోగొట్టుకోండి. మీ అదృష్టం బావుంటే, ఆ గుంతల రోడ్డు మీద బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు.. వర్షం కురవనూ వచ్చు.. కాబట్టి, మీ వెంట ఓ గొడుగు కూడా తీసుకెళ్ళండి.. ఎందుకంటే, బస్సులోనే మిమ్మల్ని వర్షపు నీటిలో తడిపేందుకు తగిన ఏర్పాట్లున్నాయ్.!

సంక్షేమ పథకాల కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఔను, నిజంగానే ఖర్చు చేస్తున్నారు. ఓ రెండు మూడు వేల కోట్లు ఖర్చు చేస్తే, రాష్ట్రంలో వున్న గుంతల రోడ్లు బాగైపోతాయ్ కదా.? ఇంకా నయ్యం, అలా చేస్తే.. రోడ్ల మీద వెళ్ళేవారికి ఉయ్యాలాటలు, బస్సుల్లోనే సెలయేళ్ళు ఎలా సాధ్యమవుతాయ్.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్ల మీద వెళ్ళి జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు తప్ప, ఎందుకీ రోడ్ల దుస్థితి.? అని ప్రజా ప్రతినిథుల్ని నిలదీయడంలేదు. నిజంగానే నిలదీయడంలేదా.? నిలదీస్తున్నవాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపిస్తున్నారా.? అన్నదానిపై మళ్ళీ భిన్నవాదనలున్నాయ్. రోడ్ల తీరుతో విసుగు చెంది, తమవంతుగా రోడ్లను బాగు చేయించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే, అలాంటివారిపై కేసులు పెడుతున్న సందర్భాల్ని చూస్తున్నాం మరి.!

ప్రతిసారీ.. అంటే, ముఖ్యమంత్రి రోడ్ల దుస్థితిపై సమీక్షించినప్పుడల్లా డెడ్‌లైన్లు పెడుతుంటారు అధికారులకి. కానీ, రోడ్ల మీద గుంతలు ఏడాదికేడాది ఇంకా పెద్దవవుతున్నాయ్ తప్ప తగ్గడంలేదు. రహదార్లపై ఆర్టీసీ బస్సులు చక్రాలు ఊడగొట్టుకుంటున్నాయ్.. గోతుల్లో దిగబడిపోతున్నాయ్. ఆర్టీసీ బస్సుని ప్రగతి రధ చక్రంగా అభివర్ణిస్తుంటారు. అసలంటూ రాష్ట్రానికి అభివృద్ధి అనే కోణంలో ప్రగతి అవసరం లేదు గనుక, ప్రగతి రధ చక్రాలు ఊడిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నమాట. ఈ రోడ్లలో మేం బస్సుల్ని నడిపించలేం.. అని గట్టిగా చెప్పే పరిస్థితి ఆర్టీసీ సిబ్బందికీ లేకుండా పోతోంది.

అయినా, బస్సుల్లో గొడుగులేసుకెళ్ళడమేంటి ఖర్మ కాకపోతే.? ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్.! పుసుకున్న ఫ్యాక్ట్ చెక్.. అంటూ ‘అదంతా ఉత్తదే’ అన్న ప్రకటనలు ఇచ్చినా ఇచ్చేస్తారు. ప్రజల్ని మభ్యపెట్టడం బాగా అలవాటైపోయింది కదా.! ఒక్క రాజధానికే ‘ఓపిక’ లేనోడు, మూడు రాజధానులెలా కడతాడు.? అసలంటూ రోడ్లనే బాగు చేయలేనోడు, రాష్ట్రాన్నెలా పరిపాలిస్తాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు మామూలుగా పేలడంలేదు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...