కార్తికేయ, నేహా శెట్టి జంటగా ఒక సినిమా రూపొందుతోంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న ‘కలర్ ఫొటో’ ని తీసిన నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ‘బెదురులంక 2012’ అనే టైటిల్ ఖరారు చేశారు. నేడు కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ “మా హీరో కార్తికేయకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే షూటింగ్ ను ముగిస్తాం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఐదు అద్భుతమైన బాణీలను అందించారు. ‘స్వర్గీయ’ సిరి వెన్నెల గారు మా చిత్రంలో ఒక పాట రాశారు” అన్నారు. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది. మనసుకు నచ్చినట్టు జీవించే పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తారు.