యాంకర్ లాస్య మంజునాథ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే పాపులర్. మొదట యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన లాస్య, యాంకర్ రవితో కలిసి చేసిన ప్రోగ్రామ్స్ వలన బాగానే పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె బిగ్ బాస్ ప్రయాణం ప్రేక్షకులకు ఆమెను మరింత దగ్గరచేసింది.
బిగ్ బాస్ నుండి వచ్చాక లాస్య యూట్యూబర్ గా సెటిల్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక రీసెంట్ గా లాస్య తన అభిమానులకు, ఫాలోయర్స్ కు గుడ్ న్యూస్ షేర్ చేసింది. తన భర్తతో కలిసి దిగిన ఫొటోలతో తాను మరోసారి గర్భవతిని అయ్యాను అని తెలియజేసింది.
“మరోసారి గర్భవతిని అయ్యాను. రెండో బేబీ వస్తోంది. మా కుటుంబం మరింత పెద్దది కాబోతోంది” అని క్యాప్షన్ ను జతచేసింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ నుండి అభినందనల వెల్లువ వస్తోంది.
459115 186089A lot of thanks for sharing this fine piece. Really fascinating suggestions! (as always, btw) 607427