బిగ్ బాస్ రియాల్టీ షో పట్ల వీక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయింది. బిగ్ బాస్ ఓటీటీ డిజాస్టర్ అవడమే కాదు, ఐదో సీజన్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆరో సీజన్ గురించి అసలు మాట్లాడుకోవడమే దండగ.. అన్నట్టు తయారైంది పరిస్థితి. కంటెస్టెంట్లు పీఆర్ టీమ్స్ పెట్టుకుని ఎంత హంగామా చేయిస్తున్నా, అదీ పెద్దగా పని చేయడంలేదు.
ఫినాలె వచ్చేసింది. అయినా, సోషల్ మీడియాలో బిగ్ బాస్ హ్యాష్ ట్యాగ్ హంగామానే లేదు. ఎవరెవరు ఏ వరసలో ఔట్ అయిపోతున్నారో ముందే తెలిసిపోవడం వల్ల బిగ్ బాస్ వీక్షకులు ఈ సీజన్‌ని పూర్తిగా లైట్ తీసుకున్నారు. ఫినాలె పరిస్థితి మరీ దారుణం.
ఐదో ప్లేస్ రోహిత్, నాలుగో ప్లేస్ ఆదిరెడ్డి, మూడో ప్లేస్ కీర్తి.. రెండో ప్లేజ్ శ్రీహన్, మొదటి ప్లేస్ రేవంత్.. అని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇదే కాస్సేపట్లో జరగబోతోంది కూడా.
రేవంత్ విన్నర్ అని హౌస్‌లో ముందే అంతా ఫిక్సయిపోయారన్న ప్రచారం నాలుగైదు వారాలుగా గట్టిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగని, రేవంత్ ఏమీ ఆడలేదా.? అంటే, హౌస్‌లో వున్నంతలో రేవంత్ ఒక్కడే కాస్త బెటర్. ఆ లెక్కన రేవంత్ టైటిల్ గెలవడం కొంతవరకు కరెక్టే.
అస్సలేమాత్రం ఆసక్తి కలిగించని టాస్కులే బిగ్ బాస్‌ని ఇలా దెబ్బతీశాయన్నది నిర్వివాదాంశం. బిగ్ బాస్ లీకులు కూడా ఈసారి సీజన్‌ని బాగా దెబ్బ తీశాయ్. ఫినాలె రోజున కూడా సోషల్ మీడియాలో బిగ్ బాస్ గురించిన చర్చ పెద్దగా లేకపోవడం.. బిగ్ బాస్ హిస్టరీలోనే ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు.
మరీ దారుణమైన విషయమేంటంటే, చెప్పుకోదగ్గ స్థాయిలో సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ వీకెండ్స్‌లో సందడి చేయలేకపోయారు. బహుశా నిర్వాహకులు కూడా ఈ సీజన్ మీద ఆశలు వదిలేసుకున్నట్టున్నారు. ఇంతకీ, తదుపరి సీజన్ వుంటుందా.? ఇక్కడితో ముగింపు పలికేస్తారా.? వేచి చూడాల్సిందే.
282419 74753I like this weblog its a master piece! Glad I discovered this on google. 687396
202837 377815An intriguing discussion is worth comment. I do think that you ought to write read a lot more about this subject, it will not be considered a taboo subject but typically every person is too couple of to communicate in on such topics. To an additional. Cheers 385261
231725 879498Hi! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any guidelines? 42221