Switch to English

బులుగు సర్వే: ఇప్పుడే ఎన్నికలొస్తే 60 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఔట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే, రాష్ట్రంలో పరిస్థితి ఏంటి. ఓటర్లలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వుందా.? సంక్షేమ పథకాలు ఎంతవరకు ఓటు బ్యాంకుని పదిలం చేయగలుగుతున్నాయి.? తెలుగుదేశం పార్టీ సర్వనాశనమైపోయిందా.? ఏమన్నా పుంజుకుందా.? అధికార పార్టీ ఎమ్మెల్యేల పని తీరు ఏంటి.? మంత్రుల పని తీరు ఎలా వుంది.? ఇలా పలు అంశాలపై ఓ బులుగు సర్వే జరిగిందట. వైసీపీ అనుకూల వర్గానికి చెందిన ఓ ‘స్వతంత్ర’ సంస్థ (?!) ద్వారా సర్వే చేయించారట.

ఈ సర్వే జరుగుతున్న సమయంలో శాంపిల్స్ కొంచెం తేడా కొట్టడంతో, మరింత రహస్యంగా సర్వే జరిపి, నివేదికను నేరుగా వైసీపీ అధినాయకత్వానికి అందించారట. అందులో విషయాలు వాస్తవామా.? కాదా.? అన్న విషయమై ఇంకోసారి కూడా సరిచూసుకున్నారట. ఎన్నిసార్లు ఎంతలా కిందా మీదా వేసినా రిజల్ట్ ఒకటేనట. అదేంటంటే, 60 మంది ఎమ్మెల్యేలు దారుణంగా ఓడిపోబోతోతున్నారట. మరో 15 నుంచి 25 మంది వరకు ఎమ్మెల్యేలు టఫ్ ఫైట్ ఎదుర్కోబోతున్నాట ప్రత్యర్థి పార్టీల నుంచి. మంత్రుల్లోనూ ఆరుగురి వికెట్లు పడిపోబోతున్నాయట.

సంక్షేమ పథకాలు ఎడా పెడా అమలు చేస్తున్నా నరకానికి కేరాఫ్ అడ్రస్ అయిపోయిన రోడ్లు, పెరిగిపోయిన ధరలు, కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ అలాగే ఉపాధి అవకాశాలు దొరక్కపోవడం.. ఇలా చాలా కారణాలు అధికార పార్టీకి సంకటంగా మారాయంటున్నారు. ఇక, నివేదిక అందుకోగానే, ఓడిపోయే క్యాండిడేట్ల స్థానంలో కొత్త నాయకత్వాన్ని తయారు చేసే దిశగా నామినేటెడ్ పోస్టులకు తెరలేపిందట వైసీపీ అధిష్టానం. ఇదంతా మే నెలలో జరిగిన సర్వే, తదనంతర పరిణామాల సారాంశమని అంటున్నారు. ఈ రెండు నెలల్లో అధికార పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిందట.

అదేంటీ, స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తిరుగు లేదు కదా.? అంటే, అధికారంలో వున్న పార్టీ.. అధికారాన్నంతా కేంద్రీకరించి ఇలాంటి ఎన్నికల్లో ఏకగ్రీవ గెలుపులు సొంతం చేసుకోవడం వింతేమీ కాదని వైసీపీకి చెందిన ఓ సీనియర్ నేత ఆఫ్ ది రికార్డ్‌గా అభిప్రాయపడ్డారట. పార్టీ పరిస్థితి బాగా లేదని, సీనియర్లు కొందరు అధినేతకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన వినే పరిస్థితుల్లో లేకపోవడమే ఈ దుస్థితికి కారణమన్నది ఇంకొందరి అభిప్రాయం.

కాగా, గత ఎన్నికల్లో ఏయే చోట్ల పూర్తిగా టీడీపీ గల్లంతయ్యిందో, ఆ ప్రాంతాల్లో టీడీపీ తిరిగి పుంజుకుందని వైసీపీ సర్వేలోనే తేలిందంటున్నారు. ఇదిలా వుంటే, రానున్న రెండేళ్ళలో ఉధృతంగా పార్టీ పరమైన కార్యక్రమాలు చేపట్టాలనీ, మంత్రులు మెరుపు పర్యటనలతో ప్రజల్లో వుండాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారట.

ఎక్కడెక్కడ బలహీనమవుతున్నామో, ఆయా చోట్ల పార్టీ పటిష్టత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పార్టీ ముఖ్య నేతలకు అధినేత వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ సొంత సర్వేలోనే 60 మందికి పైగా ఎమ్మెల్యేలు ఔట్ అవుతారని తేలిందంటే, స్వతంత్ర సంస్థ ఏదన్నా సర్వే చేస్తే.. దానికి రెండింతలు.. ఆ పైన నష్టం కింది స్థాయిలో వైసీపీకి జరిగిపోయిందనే కదా అర్థం.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...