Switch to English

రాయలసీమలో కుంపటి రాజేస్తున్న వైసీపీ: నష్టమెవరికి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

‘దగాపడ్డ రాయలసీమ..’ అంటూ వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి రాయలసీమ ఆత్మగౌరవ నినాదంతో తిరుపతిలో పెద్ద ‘షో’ చేస్తున్నారు. ఇందుకోసం రాయలసీమ జిల్లాల నుంచి పెద్దయెత్తున ప్రజానీకాన్ని తరలిస్తున్నారు. మొన్నామధ్యన విశాఖలో గర్జన నిర్వహించింది వైసీపీ.. అదీ నాన్ పొలిటికల్ జేఏసీ ముసుగులో. ఈసారి అలాంటి ముసుగులేం లేవు.. నేరుగా వైసీపీ ఎమ్మెల్యేనే హంగామా చేస్తున్నారు.

రాయలసీమ ఆత్మగౌరవం, దగాపడ్డ రాయలసీమ.. ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి బాగానే వుంటాయి. ఎవరి చేతిలో రాయలసీమ దగా పడింది.? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావొచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కావొచ్చు.. ఎవరు.. ఏ ప్రాంతానికి చెందినవారు ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా వున్నారు.? అన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నకు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సమాధానం చెప్పాల్సి వుంటుంది.

గతంలోలా ప్రజలు మోసపోయేందుకు ఇంకోసారి సిద్ధంగా వున్నారా.? ఏమో, అదైతే ఇప్పుడే చెప్పలేం. కానీ, ప్రజల్లో కొంతమేర చైతన్యం కనిపిస్తోంది. బలవంతంగా జనాన్ని తరలించడం తప్ప, సోకాల్డ్ రాజకీయ నాయకులు పిలుపునిస్తే స్వచ్ఛందంగా జనం ఆయా పెయిడ్ ఉద్యమాలకు వెళ్ళేలా కనిపించడంలేదు.

విశాఖ గర్జనలో నిరూపితమయ్యింది అదే. దాన్ని పెయిడ్ ఉద్యమంగా జనమే తేల్చేశారు. ఇప్పుడు తిరుపతిలో కూడా అదే జరగబోతోంది. తిరుపతిలో వైసీపీ నిర్వహిస్తున్న రాయలసీమ ఆత్మగౌరవం అనే కార్యక్రమానికి, అదే రాయలసీమకి చెందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు హాజరు కావడంలేదు.?

అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తమ నినాదమని చెప్పుకుంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్, విశాఖ గర్జనకు ఎందుకు హాజరు కాలేకపోయారు. ఇక్కడే అధికార పార్టీ డొల్లతనం బయటపడిపోయింది. వాస్తవానికి రాయలసీమ ఆత్మగౌరవ సభ కావొచ్చు.. ఇంకో పేరు ఏదైనా కావొచ్చు.. దాన్ని వైసీపీ జ్యుడీషియల్ క్యాపిటల్‌గా పేర్కొంటున్న కర్నూలులో కదా నిర్వహించాల్సింది.?

మూడున్నరేళ్ళవుతోంది రాష్ట్రానికి వున్న ఏకైక రాజధాని అమరావతిని అయోమయంలో పడేసి, దాన్ని స్మశానంగా అభివర్ణిస్తూనే.. దాన్ని మళ్ళీ శాసన రాజధాని అని పేర్కొనడంతోనే వైసీపీ చిత్తశుద్ధి ఏంటన్నది రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకూ అర్థమయిపోతోంది. ఎలా చూసినా, ఈ బులుగు పెయిడ్ ఉద్యమాల వల్ల నష్టం వైసీపీకే తప్ప, వేరే పార్టీలకు ఎలాంటి నష్టం వుండబోదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...