Switch to English

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

91,428FansLike
56,274FollowersFollow

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల కార్ల టైర్ల విషయంలో కొంత నిర్లక్ష్యం వుండొచ్చు. కానీ, ప్రముఖుల విషయంలో అలా జరగదు కదా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాతృమూర్తి విజయమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఆమెకు అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలూ తగల్లేదు. అయితే, రోడ్డు ప్రమాదంపై చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కారు టైర్లు పేలడంతో ప్రమాదం సంభవించిందట. డ్రైవరు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందట. ప్రమాదం జరిగిన వెంటనే, విజయమ్మను వేరే కారులో అక్కడి నుంచి పంపేశారట. విజయమ్మ మాజీ ఎమ్మెల్యే. పైగా, వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా పని చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ పనుల్లో బిజీగా వున్నారు. త్వరలో ఆమెకు వైటీపీ గౌరవాధ్యక్షురాలి పదవి దక్కనుందనే ప్రచారమూ జరుగుతోంది.

అసలు రెండు టైర్లు ఎందుకు ఒకేసారి పేలతాయి.? ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర వుందా.? సాధారణ నెటిజన్లే కాదు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ ఈ అనుమానం వచ్చింది. ‘వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపించాలి.. గొడ్డలిపోటుతో చనిపోయిన వైఎస్ వివేకానందరెడ్డి విషయంలో గుండె పోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది.? ఈ టైర్లు పేలి విజయమ్మ కారుకి ప్రమాదం సంభవించడానికి కారణమేంటి.? వంటి అంశాలపై ప్రజలకు నిజాలు తెలియాలి..’ అంటున్నారు రఘురామకృష్ణరాజు.

హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతే, దాని వెనుక పెద్ద కుట్ర వుందనే అనుమానాలు అప్పట్లో వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయారు. వరుసగా, వైఎస్ కుటుంబంలోని వ్యక్తులకే ఇలా ఎందుకు జరుగుతోంది.? అన్నది రఘురామకృష్ణరాజు డౌటానుమానం.

ఔను, కాస్త లోతుగానే ఆలోచించాలి ఈ విషయంలో. ఇటీవలే వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు వైఎస్ విజయమ్మ. సో, విజయమ్మ కారు ప్రమాదం వెనుక కుట్ర వుండి వుండొచ్చన్న రఘురామ అనుమానాల్ని తేలిగ్గా కొట్టి పారేయలేం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: సోమవారం 03 అక్టోబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:54 సూర్యాస్తమయం: సా.5:51 తిథి: ఆశ్వయుజ శుద్ధ అష్టమి సా..4:02 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ నవమి సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం) నక్షత్రము: పూర్వాషాఢ రా.12:50...

వారసత్వాన్ని వైఎస్ జగన్ ఎందుకు ఒప్పుకోవడంలేదు.?

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగానే కదా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చింది. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద తీవ్రమైన ఒత్తిడిని తెచ్చి, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

దివి పాప టైట్ డ్రెస్ లో ఎంతగా అందాలు చూపిస్తుందో చూడండి

తెలుగు బిగ్‌ బాస్ తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ దివి. బిగ్‌ బాస్ కి ముందు చాలా సినిమాల్లో నటించింది. కానీ ఏ ఒక్కటి కూడా ఈమెకు గుర్తింపు తెచ్చి...

రామ్ చరణ్ @15..! నటన, వ్యక్తిత్వం, వారసత్వం.. అన్నింటా ‘శిఖరమే’

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి.. నవ్విన నాప చేను పండుతుంది.. మనుషులు వారి జీవితాలకి సంబంధించిన సామెతలు ఇవి. ఈ సామెతల బలం ఎంతో.. నిజం జీవితంలో చేసి చూపించారు మెగా పవర్ స్టార్...