Switch to English

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

91,428FansLike
56,273FollowersFollow

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు డిమాండ్ చేసినట్లు.?

కానీ, తప్పదు.. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే తన ఇజ్జత్ పోతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరినట్లు ‘బేషరతు క్షమాపణ’ చెప్పారు, పార్టీ పరంగా అద్దంకి దయాకర్ మీద చర్యలుంటాయనీ అన్నారు. నిజానికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేసిన విమర్శలకు సంబంధించి అద్దంకి దయాకర్ ఇప్పటికే క్షమాపణ చెప్పారు.. ఆయనకు షోకాజ్ నోటీస్ కూడా జారీ అయ్యింది.

‘రేవంత్ రెడ్డి క్షమాపణ చెబితే సరిపోదు, అద్దంకి దయాకర్‌ని పార్టీ నుంచి బయటకు పంపాల్సిందే..’ అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పోనీ, అలాగే జరుగుతుందనుకుందాం. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తారా.? ఛాన్సే లేదు. అసలు అస్తిత్వమే ‘కోమటిరెడ్డి బ్రదర్స్’ అని.! ఆ బ్రదర్స్ రెండుగా విడిపోయి, వేర్వేరు పార్టీల్లో వుంటే, ఇద్దరికీ కష్టమే.

‘తగిన సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సరైన నిర్ణయం తీసుకుంటారు..’ అంటూ సోదరుడి రాజకీయ భవిష్యత్తు విషయమై బీజేపీలోకి దూకేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం చూస్తోంటే, త్వరలోనే వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి దూకెయ్యడం ఖాయంగానే కనిపిస్తోంది.

ఈమాత్రందానికి రేవంత్ రెడ్డి ఎందుకు క్షమాపణ చెప్పారు.? ఇక్కడే వుంది అసలు కిటుకు. మునుగోడులో కాంగ్రెస్ ఓడితే, దానికి బాధ్యుడిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూపించేందుకు రేవంత్ అండ్ టీమ్ సమాయత్తమైపోయింది. అదెలాగూ జరుగుతుంది.

ఆ వైఫల్యం తన ఖాతాలో పడకూడదంటే, ఇప్పుడు ‘తగ్గక’ తప్పని పరిస్థితి రేవంత్ రెడ్డికి వచ్చింది. అద్గదీ అసలు సంగతి. రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి.. ఈ డ్రామా రసవత్తరంగా సాగుతోంది. ఎవరిది పై చేయి అవుతుంది.? అంటే, ఆల్రెడీ పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో రేవంత్ రెడ్డిదే పై చేయి అయ్యింది మరి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

జబర్దస్త్‌ కమెడియన్‌ కన్నుమూత… అంతా షాక్‌

తెలుగు సినిమా పరిశ్రమ మరో కళాకారుడని కోల్పోయింది. బుల్లి తెర మరియు వెండి తెరపై ఎన్నో పాత్రలో నటించిన మిమిక్రీ మూర్తి మృతి చెందారు. మంగళవారం ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా...

గ్లామర్ హద్దులు చెరిపిస్తోన్న ‘శ్రీవల్లి’

చాలా తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుండి ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక చాలా తక్కువ కాలంలోనే సూపర్ హిట్ సినిమాలను సొంతం...

అక్కడ మాత్రమే సందడి.. ఇలా అయితే కష్టం

తమిళ ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్‌ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన పొన్నియన్ సెల్వన్‌ వసూళ్ల గురించి ప్రస్తుతం ఆసక్తికర...

జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు… రేటు ఎంతో తెలుసా?

ఏది ఏమైనా కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్ అన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేడు కాకపోతే రేపు... రేపు కాకపోతే ఎల్లుండి అయినా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్...

రాశి ఫలాలు: శనివారం 01 అక్టోబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:54 సూర్యాస్తమయం: సా.5:51 తిథి: ఆశ్వయుజ శుద్ధ షష్ఠి రా.8:40 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ సప్తమి సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం) నక్షత్రము: జ్యేష్ఠ తె.4:06 వరకు...