నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది. మరి కార్తికేయ 2 ఎలా ఉందో చూద్దామా.
కథ:
కార్తికేయ (నిఖిల్) మెడికల్ కోర్స్ పూర్తి చేసి డాక్టర్ అవుతాడు. కొత్త విషయాలు నేర్చుకోవాలన్న కుతూహలం, సమాధానం దొరకని ప్రశ్నలను చేధించాలన్న ఉత్సాహం తనలో ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా కార్తికేయ, ద్వారకలోని కృష్ణుడ్ని దర్శించుకోవడానికి వెళాతాడు. అక్కడికి వెళ్లాకే తెలుస్తుంది. తన రాకకు ఒక కారణం ఉందని, తనకొక లక్ష్యం ఉందని. ఇంతకీ అదేంటి? తన మిషన్ లో కార్తికేయ ఎంత వరకూ సక్సెస్ సాధించాడు అన్నాయి ప్రధాన కథ.
నటీనటులు:
నిఖిల్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసాడు. తన స్క్రీన్ ప్రెజన్స్, నటనలో డెప్త్ తో కట్టిపడేసాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో నిఖిల్ నటన సూపర్బ్. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాడు. ఇక హీరోయిన్ గా చేసిన అనుపమ పరమేశ్వరన్ ఇంప్రెస్ చేస్తుంది. సినిమా అంతటా తను ఉన్నా కానీ ప్రాధాన్యమున్న సన్నివేశాలు మాత్రం కొన్నే. విలన్ గా ఆదిత్య మీనన్ నటన ఓకే.
శ్రీనివాస రెడ్డి, వైవా హర్షలు తమ కామెడీతో గిలిగింతలు పెడతారు. ఇక మిగిలిన పాత్రలు చేసిన వాళ్ళు తమ పరిధుల మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణులు:
కాల భైరవ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ప్లస్ పాయింట్. తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ముఖ్యమైన సన్నివేశాలను చాలా బాగా ఎలివేట్ చేసాడు. ఇక పాటలు పర్వాలేదనిపిస్తాయి. కార్తీక ఘట్టమనేని ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్స్ ను హ్యాండిల్ చేసాడు. ఈ రెండు విభాగాలలో తన పనితీరుతో మెప్పిస్తాడు. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. లిమిటెడ్ బడ్జెట్ లోనే తెరకెక్కినా ఈ చిత్రానికి నిర్మాణ విలువలు సూపర్బ్.
ఇక దర్శకుడు చందూ మొండేటి విషయానికొస్తే, తన దర్శకత్వ ప్రతిభ ఆశ్చర్యపరుస్తుంది. కృష్ణుడి గురించి చాలానే రీసెర్చ్ చేసాడు అని అర్ధమవుతుంది. అన్ని డాట్స్ ను చందూ లాస్ట్ లో కనెక్ట్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది.
పాజిటివ్ పాయింట్స్:
- కృష్ణుడి థీమ్
- ఆర్టిస్ట్ ల పెర్ఫార్మన్స్
నెగటివ్ పాయింట్స్:
- స్లో గా సాగే నరేషన్
- కొన్ని చోట్ల సరైన డిటైలింగ్ ఇవ్వకపోవడం
విశ్లేషణ:
మొత్తంగా చూసుకుంటే, కార్తికేయ 2 ఒక మంచి అడ్వెంచర్ థ్రిల్లర్. కృష్ణుడి థీమ్ ఈ చిత్రానికి కొత్తదనాన్ని తీసుకొచ్చింది. కొన్ని చోట్ల చిత్రం నెమ్మదించినా మొత్తంగా చూసుకుంటే ప్రేక్షకుడు సంతృప్తిగా థియేటర్ నుండి బయటకు అడుగుపెడతాడు.
తెలుగు బులెటిన్ రేటింగ్: 3/5
440002 384733when i was a kid, i adore to receive an assortment of birthday presents like teddy bears and mechanical toys, 828602