Switch to English

వైసీపీ కష్టం పగవాడిక్కూడా రాకూడదంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

బీజేపీ, టీడీపీ కలవబోతున్నాయా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అనే ప్రకటన వెనుక అంతరార్థం ఇదేనా.? జనసేన మాటల్ని బీజేపీ, టీడీపీ సీరియస్‌గా తీసుకున్నాయా.? ఔను, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. బీజేపీ – టీడీపీ మళ్ళీ కలవొచ్చు. బీజేపీ – టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయొచ్చు.! ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ 2024 ఎన్నికల్లో సాధ్యపడుతుందని చెప్పలేం.

టీడీపీతో కలవడం వల్ల లాభమా.? నష్టమా.? అన్నదానిపై బీజేపీ ఇంకా బేరీజు వేసుకోవాల్సి వుంది. మిత్ర పక్షం జనసేనతోనూ బీజేపీ చర్చించాల్సి వుంది. అదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. అయితే, ఢిల్లీ నుంచి అందుతున్న లీకుల ప్రకారం బీజేపీ – టీడీపీ మధ్య ఓ అవగాహన కుదిరినట్లే కనిపిస్తోంది.

అన్నటికీ మించి, గత కొద్ది రోజులుగా వైసీపీ అధినాయకత్వం దగ్గర్నుంచి, చోటా మోటా నాయకుల వరకూ జనసేన పార్టీ మీద విరుచుకు పడుతున్న వైనాన్ని చూస్తోంటే, జనసేన అంటే అంతలా ఆ పార్టీ భయపడుతోందన్న విషయం సుస్పష్టమవుతోంది బీజేపీ – టీడీపీని జనసేన కలుపుతోందా.? అన్నది వేరే చర్చ. కానీ, వైసీపీ భయం చూస్తోంటే, ‘మనం కలవాల్సిందే..’ అన్న భావన ఈ మూడు పార్టీల్లోనూ వ్యక్తమవడంలో వింతేముంది.?

చంద్రబాబుతో కలవొద్దంటూ బీజేపీ జాతీయ నాయకత్వానికి వైసీపీ ఢిల్లీ దూతలు గత కొంతకాలంగా మొరపెట్టకుంటూనే వున్నారు. ఈ మధ్య పదే పదే ఢిల్లీకి వెళుతున్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన సాయం గురించి మాట్లాడకుండా.. కేవలం రాజకీయ అంశాల గురించే మాట్లాడి వస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు.

ఎంతలా వైసీపీ గింజుకుంటున్నా, బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు అనుగుణంగానే ముందడుగు వేస్తుందన్నది నిర్వివాదాంశం. ఏమో, బీజేపీ లెక్కలు ఎలా వున్నాయో ప్రస్తుతానికైతే పూర్తి స్పష్టత లేదు. కానీ, ఈ ర్యాగింగ్ దెబ్బకి వైసీపీ గింజుకుంటోంది. వైసీపీ గింజుకుంటోంటే, ఆటోమేటిక్‌గా జనసేన పార్టీ మోములో ఖచ్చితంగా వెటకారపు నవ్వు కనిపిస్తుంటుంది. ప్చ్.. వైసీపీ కష్టం పగవాడిక్కూడా రాకూడదంతే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...