ఆయనో వైసీపీ నేత.! అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులనీ, కూకట్‌పల్లి ఆంటీలనీ అభివర్ణించిన పార్టీకి చెందిన నాయకుడు కదా.? జ్యోతిలక్ష్మి, జయమాలిని పాటలకు డాన్సులేసేవాళ్ళు రైతులా.? అని ఆయన ప్రశ్నించడంలో వింతేముంది.? ఓ ఇంటర్వ్యూలో, అది కూడా వైసీపీ అనుకూల మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్ని, అందునా మహిళా రైతుల్ని అత్యంత దారుణంగా కించపర్చే ప్రయత్నం చేశాడు.
జయమాలిని, జ్యోతిలక్ష్మి డాన్సులంటే, ఈయనగారికి వున్న అవగాహన ఏంటి.? వైసీపీలో పలువురు సినీ ప్రముఖులున్నారు. అందులో మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆమె గతంలో సినిమాల్లో నటించారు. అప్పుడెప్పుడో సినిమాల్లో పోషించిన గ్లామరస్ రోల్స్ సంగతి పక్కన పెడదాం, ఎమ్మెల్యే అయ్యాక జబర్దస్త్ వేదికగా రోజా వేసిన డాన్సుల మాటేమిటి.?
సినిమా అనేది ఓ కళ. అందరూ హీరోయిన్లయిపోరు. కొందరు ఐటమ్ సాంగ్స్ కూడా చేయాల్సి వస్తుంది. కాజల్, సమంత తదితర స్టార్ హీరోయిన్లూ ఐటమ్ సాంగ్స్ చేశారు. వీటినే ఒకప్పుడు క్లబ్ సాంగ్స్ అనేవారు.. వాటికే జయమాలిని, జ్యోతిలక్ష్మి లాంటోళ్ళు డాన్సులు చేశారు.
అయినా, జ్యోతిలక్ష్మి.. జయమాలిని లాంటి డాన్సులేసిన సినీ నటి రోజా, వైసీపీలో ఎమ్మెల్యే అయి.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రి కూడా అయినప్పుడు, ఆ తరహా డాన్సుల్ని రైతులు ఎందుకు వెయ్యకూడదు.? నిజానికి, ఇక్కడ వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి తాను అవమానించింది, ఎగతాళి చేసిందీ రైతుల్ని అనీ అనుకుంటున్నారేమో.!
కారుమూరి వెంకటరెడ్డి నిజంగా అవమానించింది ఆ పార్టీ ఎమ్మెల్యే, మంత్రి రోజాని. అంతే కదా.! జయమాలిని, జ్యోతిలక్ష్మి లాంటి డాన్సులేసేవాళ్ళని రైతులుగా ఒప్పుకోనప్పుడు, మంత్రులుగా ఎలా ఒప్పుకుంటారు.? రైతు అంటే, వ్యవసాయం చేసేటోడు. కష్ట జీవి. ఆ రైతు ఆహ్లాదం కోసం డాన్సులేస్తే తప్పేంటి.? అరచకాలు చేస్తే, హత్యలు చేస్తే, దోపిడీలు చేస్తే కదా నేరం.? పోనీ, తప్పు చేసి జైలుకెళ్ళినా తప్పు పట్టొచ్చు.!
జైలుకెళ్ళొచ్చినోళ్ళు ముఖ్యమంత్రులవగా లేనిది.. క్యాబరే డాన్సులేసినోళ్ళు మంత్రులు అవగా లేనిది.. రైతులు డాన్సులు చేస్తే నేరమా.? నవ్విపోదురుగాక బులుగు పార్టీ వాళ్ళకేటి సిగ్గు.?
947796 633590extremely good put up, i definitely enjoy this web internet site, carry on it 617597
449934 136662forty men and women that function with all of the services Oasis provides, and he is actually a really busy man, he 14287