సమంత వేస్టు.. ఆర్జే సూర్య తోపు.! అనవసరంగా కోట్లు వెచ్చించి సమంతతో ‘పుష్ప ది రైజ్’ సినిమాలో సుకుమార్ ‘ఊ అంటావా మావా..’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ చేయించినట్లున్నాడు. హీరోల్లా మాట్లాడటమే కాదు, ఐటమ్ బాంబులా డాన్స్ కూడా చేయగలడు.. హొయలొలికించగలడు ఆర్జే సూర్య.!
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ ఆర్జే సూర్య గురించి సోషల్ మీడియా వేదికగా పేలుతున్న సెటైర్లివి. హీరోయిన్ల కంటే హాట్‌గా సింగిల్ పీస్ డ్రెస్ వేసుకుని, ఆర్జే సూర్య ‘ఊ అంటావా మావా..’ సాంగ్‌కి డాన్స్ చేస్తోంటే, బిగ్ బాస్ వ్యూయర్స్ షాక్‌కి గురయ్యారనడం అతిశయోక్తి కాదేమో.
అన్నట్టు, ఆర్జే సూర్య.. ఆరోహితో మసాజ్ చేయించుకోవడంపై పెద్దయెత్తున దుమారం చెలరేగుతోంది. బిగ్ బాస్ రియాల్టీ షోని ‘వ్యభిచా కూపంలా మార్చేశారు..’ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అవిప్పుడు మరింత బలపడుతున్నాయి.
ఇదిలా వుంటే, ఎప్పుడూ కూల్‌గా కనిపించే బాలాదిత్య ఒకింత గుస్సా అయ్యాడు. సింగర్ రేవంత్ మీద మండిపడ్డాడు. అది కూడా ‘కప్పులో పప్పు’ వ్యవహారానికి సంబంధించి. ‘పప్పు వుంది వేసుకో.. అంటే, మజ్జిగలో పప్పు వేసుకుంటా..’ అంటూ వెటకారంగా రేవంత్ సమాధానమిచ్చాడు. దానిపై బాలాదిత్య అసహనం వ్యక్తం చేశాడు.
‘లేనప్పుడు ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోవాలి. అదే నాకు కావాలని మొండికేస్తే ఎలా.?’ అని బాలాదిత్య వ్యాఖ్యానించడంతో, రేవంత్‌ని అనవసరంగా బాలాదిత్య టార్గెట్ చేశాడంటూ రేవంత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా బాలాదిత్యని ట్రోల్ చేస్తున్నారు. బాబా బాలాదిత్య.. అంటూ, నిత్యానంద స్వామి గెటప్‌లో బాలాదిత్య ఫొటోల్ని మార్ఫింగ్ చేస్తున్నారు.
నిజానికి, బిగ్ బాస్ రియాల్టీ షోకి కంటెస్టెంట్లు ఎందుకొచ్చారో తెలియదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నిఖార్సయిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. కమెడియన్ చంటి పూర్తిగా వేస్టయ్యాడు. ఐటమ్ బాంబ్ వ్యవహారాలు, మసాజ్ ట్రిక్కులు, స్క్రిప్టెడ్ గొడవలూ రోజు రోజుకీ బిగ్ బాస్ పట్ల వీక్షకుల్లో ఆసక్తిని తగ్గించేస్తున్నాయ్.
19184 760322Hey! Excellent post! Please do tell us when we can see a follow up! 804614