Switch to English

జనసేనాని ఈక్వేషన్ క్లియర్.! వైసీపీకే టెన్షన్ టెన్షన్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడమంటే, దానర్థం.. తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన పోటీ చేస్తున్నట్లేనని బులుగు పచ్చ విశ్లేషకులు తెగేసి చెబుతున్నారు. అయినా, ఇప్పటికిప్పుడు ఎన్నికలేమీ లేవు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో. మిత్రపక్షం బీజేపీతో జనసేన ఏమైనా మరీ రాసుకు పూసుకు తిరుగుతోందా.?

ఎన్నికల సమయంలో పొత్తుల అంశం చర్చకు వస్తుంది. ఈలోగా వైసీపీ నేతలు తొందరపడి ‘ఓండ్రపెడుతుండడాన్ని’ జనసేన ఎంజాయ్ చేస్తోంది. అయితే, తెలుగు మీడియాలో మెజార్టీ మీడియా సంస్థలు టీడీపీకి అనుకూలమో.. లేదంటే వైసీపీకి అనుకూలమో అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.

ఇది చాలక, ప్రభుత్వ ప్రకటనల పేరుతో వెబ్ మీడియాని కూడా వైసీపీ తన అదుపులోకి తెచ్చుకుంటోంది. ప్రభుత్వ ప్రకటనలు రావాలంటే, అధికార పార్టీ అనుకూల కథనాలు తప్పనిసరి. నిజానికి.. ప్రభుత్వం వేరు.. పార్టీ వేరు.! కానీ, జరుగుతున్నది అది కాదు.

ప్రజా ధనం వెచ్చించి ఇచ్చే ప్రభుత్వ ప్రకటనలతో, అధికార పార్టీకి అనుకూలంగా వార్తలు రాయించుకుంటున్నారు. ఇంత చేస్తూ కూడా జనసేన అంటే వైసీపీ ఎందుకు భయపడుతోంది.? అన్నది రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది.

‘వైనాట్ 175’ అనే ధీమా వైపీపీలో వున్నప్పుడు, జనసేన గురించి ఆలోచించాల్సిన పనిలేదు. కానీ, ‘నేను అధికారంలోకి రావడం, రాకపోవడం అనేది వేరే విషయం. ముందైతే మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి.. జనసేన అధికారంలోకి వస్తే, మీకు మంచి పాలన అందిస్తానని మాత్రం నేను చెప్పగలను..’ అని జనసేన అధినేత స్పష్టం చేస్తున్నారు.

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. అంటే, ఆ వైసీపీ వ్యతిరేక ఓటు మొత్తం జనసేన వైపు తిరిగేలా చేస్తానన్నది జనసేనాని చెబుతున్నమాట. ఈ క్రమంలో టీడీపీ కూడా తమతో కలిసి వస్తుందని జనసేనాని భావిస్తే అందులో తప్పేముంది.? ఈ విషయం వైసీపీకి స్పష్టంగానే అర్థమవుతోంది. కానీ, అర్థం కానట్లు వ్యవహరిస్తోంది.. పెడార్ధాలు తీస్తోంది.

ఓ పాతిక సీట్లు జనసేకు వచ్చినా, జనసేనకు అది చాలా అడ్వాంటేజ్. 2019 ఎన్నికల్లో వచ్చింది ఒక్కటే సీటు. ఆ లెక్కన.. ఇంకోటి గెలిచినా. అది జనసేన బలం పుంజుకున్నట్లే అవుతుంది. అలాంటిది, 100కి పైగా సీట్లలో జనసేన సత్తా చాటే అవకాశం వుందంటూ పలు నివేదికలు చెబుతున్న దరిమిలా వైసీపీ కంగారుపడకుండా ఎలా వుంటుంది.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...