వైసీపీకి డేంజర్‌ బెల్స్‌: ఇరకాటంలో సీఎం వైఎస్‌ జగన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,274FansLike
57,764FollowersFollow

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రారంభించి, తనను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్‌ పార్టీని ఎదిరించి, తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతిపక్షంగా తలపడి, నిలబడ్డారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ఆయన కష్ట ఫలించింది.. అధికార చేతికొచ్చింది. కానీ, ఇప్పుడు కథ అడ్డం తిరుగుతోంది. ఓ వైపు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలన, ఇంకో వైపు పార్టీ అధినేతగా చక్కబెట్టాల్సిన వ్యవహారాలతో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

కీలకమైన అంశాలపై మీడియా ముందుకొచ్చేందుకు వైఎస్‌ జగన్‌ మొహమాటపడాల్సి వస్తోంది. నిజానికి, ఆయన మొహం చాటేస్తున్నారని అనడం సబబేమో. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి వ్యవహారాలపై వైఎస్‌ జగన్‌ పెదవి విప్పలేని పరిస్థితి ఏర్పడిందిప్పుడు. వైసీపీ – టీడీపీ మధ్య ‘ఆత్మకూరు’ రచ్చ చిన్నదేమీ కాదు. ఈ వ్యవహారంలో వైసీపీ ఇమేజ్‌ దారుణంగా డ్యామేజ్‌ అయిపోయింది.

అయినాగానీ, వైఎస్‌ జగన్‌, తన చుట్టూ వున్న ‘కోటరీ’ని దాటి, బయటకొచ్చి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునే అవకాశం లేకుండా పోతోంది. దాదాపు అన్ని విషయాల్లోనూ ఇదే పరిస్థితి. పవర్‌ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారంపై వైఎస్‌ జగన్‌ యూటర్న్‌ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. రేపో మాపో పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అదే పరిస్థితి రావొచ్చు. అమరావతి సంగతి సరే సరి.

ఎలా చూసినా, ఒకదాని వెంట ఇంకొకటి ఫెయిల్యూర్స్‌ని జగన్‌ని ఎదుర్కోక తప్పేలా లేదు. నిజానికి, తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు గనుక, వైఎస్‌ జగన్‌ కొంత సమయం తీసుకుని వుండాల్సింది వివాదాస్పద నిర్ణయాల విషయంలో. ఓ ఆరు నెలలపాటు రాష్ట్ర పరిస్థితిని అధ్యయనం చేసి, ఈలోగా సంక్షేమ పథకాల పేరుతో తమకు చెడ్డపేరు రాకుండా చూసుకోగలిగితే.. పరిస్థితి ఇంకోలా వుండేది.

చంద్రబాబు చుట్టూ ఎప్పుడూ ఓ కోటరీ వుంటుంది. దాన్ని దాటి ఆయన బయటకు రారు. అదే ఆయన్ని ఎప్పటికప్పుడు ముంచేస్తుంటుంది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ కూడా అదే ఫాలో అవుతున్నట్లున్నారు. చంద్రబాబు పరిస్థితి వేరు, వైఎస్‌ జగన్‌ పరిస్థితి వేరు. ముందు ముందు రాజకీయంగా వైఎస్‌ జగన్‌ మరింత క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు.

ప్రభుత్వంలోనే ‘నిక్కచ్చిగా మాట్లాడేవారు’ వుండడం కూడా వైఎస్‌ జగన్‌కి అవసరమే. కానీ, సొంత మీడియా కావొచ్చు.. పార్టీలో ముఖ్యమైన నేతలు కావొచ్చు.. భజన బృందంలా మారిపోవడంతోపాటుగా, వైఫల్యాల్ని కూడా గమనించలేనంతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అడ్డుపడుతున్నారు. ఇలాగైతే, రాష్ట్రంలో పాలన పడకేయడమే కాదు.. పార్టీ కూడా పడకేసేలా వుందన్నది నిర్వివాదాంశం.

6 COMMENTS

సినిమా

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే...

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.....

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.....

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల...

Ram Charan: నా మూలాలు మర్చిపోను నాన్న.. ఇంకా కష్టపడతా: రామ్...

Ram Charan: ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ‘రై రై రారా..’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ఫైర్ స్ట్రామ్...

రాజకీయం

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్ర పునర్నిర్మాణం – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగ అభివృద్ధి, పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా మాట్లాడారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన...

ఎక్కువ చదివినవి

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు: మండలిలో లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా...

ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు: లోకేష్

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి Nara Lokesh శాసనసభలో తీవ్రంగా విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే పాటలు హిట్ అయితే ఆ సినిమాపై...

Daily Horoscope: వృశ్చికానికి ఆకస్మిక లాభం, మకరానికి ఉద్యోగ పురోగతి సూచనలు

ఫిబ్రవరి 27, 2026 శుక్రవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీరు ఉత్సాహంగా పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు...

ప్రోటోకాల్ పక్కన పెట్టి బాధితుల వద్దకు చంద్రబాబు

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజయనగరం నుంచి నేరుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ఆయన పర్యటన...