Switch to English

సినిమా రివ్యూ: గ్యాంగ్‌ లీడర్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్‌ మోహన్‌, కార్తికేయ, లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను తదితరులు.
సంగీతం: అనిరుద్‌ రవిచందర్‌
ఎడిటర్‌: నవీన్‌ నూలి
సినిమాటోగ్రఫీ: మిరోస్లా
దర్శకత్వం: విక్రమ్‌ కుమార్‌
నిర్మాణం: మైత్రీ మూవీమేకర్స్‌
నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, రవి శంకర్‌ వై, మోహన్‌ (సివిఎం)
విడుదల తేదీ: 13 సెప్టెంబర్‌ 2019

ముందుగా.. ‘జెర్సీ’ తర్వాత నాని హీరోగా రూపొందిన సినిమా కావడంతో విడుదలకు ముందు సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. వివిధ వయసుల్లో వున్న ఐదుగురు మహిళల గ్యాంగ్‌కి నాని లీడర్‌ అనగానే, సినిమా మీద ఆసక్తి డబుల్‌ అయిపోయింది. నాని ఏ స్థాయిలో ఈ సినిమాతో కామెడీ పండిస్తాడోనని అతా ఎదురుచూస్తున్నారు. పైగా, ఇదొక ఫన్‌తో కూడిన రివెంజ్‌ స్టోరీ అని తెలిశాక, అంచనాలు డబుల్‌ అయ్యాయి. రొటీన్‌కి భిన్నంగా సినిమాలు తీసే దర్శకుల్లో విక్రమ్‌ కుమార్‌ ఒకరు. ఈ నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ, ఆ అంచనాల్ని ‘గ్యాంగ్‌ లీడర్‌’ అందుకున్నాడా.?

కథలోకి వెళితే..

టీజర్‌, ట్రైలర్‌తో సినిమా కథేంటన్నదానినిపై ముందే ఓ ఐడియా వచ్చేసింది. చిన్న పిల్ల దగ్గర్నుంచి, కాటికి కాలు చాపిన బామ్మ వరకూ వివిధ వయసుల్లో వున్న ఐదుగురు మహిళలు. వారికి ఓ సమస్య. ఆ సమస్య నుంచి బయటపడేందుకు పెన్సిల్‌ పార్ధసారధి (నాని) అనే రివెంజ్‌ రైటర్‌ని వారంతా ఆశ్రయించడం. వారు తనను కలిసింది రివెంజ్‌ తీసుకోవడానికి అని తెలిసి ‘పెన్సిల్‌’ షాక్‌కి గురవడం. తర్వాత వారికి సాయం చేసేందుకు ఒప్పుకోవడం. రివెంజ్‌ తీర్చుకోవాల్సింది ఓ తెలివైన విలన్‌ దేవ్‌ (కార్తికేయ) పైన. తొలుత విలన్‌ని వెతుక్కుంటూ వెళ్ళిన నానీస్‌ గ్యాంగ్‌, ఆ తర్వాత ఆ విలన్‌ తమని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తారు. మరి, మహిళా గ్యాంగ్‌తో పెన్సిల్‌ పార్ధసారధి, ఆ విలన్‌తో తలపడ్డాడా.? ఆ మహిళా గ్యాంగ్‌ రివెంజ్‌ తీరిందా.? అసలు వారి రివెంజ్‌కి కారణమేంటి.? తెరపై చూడాల్సిందే.

ఎవరెలా చేశారు.?

నో డౌట్‌, నాని నేచురల్‌ స్టార్‌. తెరపై అది ఇంకోసారి ప్రూవ్‌ అయ్యిందంతే. పెన్సిల్‌ పార్ధసారధి మాత్రమే కన్పిస్తాడు తప్ప, నాని కన్పించడు. ఆ పాత్రలో అంతలా నాని లీనమైపోయాడు. మొత్తం సినిమాని తన భుజమ్మీద మోసేశాడు. ఓ మామూలు సీన్‌ని కూడా నాని తన ప్రెజెన్స్‌తో నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్ళాడు. పాత్రలో భిన్నమైన కోణాల్ని అవలీలగా పండించేశాడు నాని. హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌తో పోల్చితే, సీనియర్‌ నటి లక్ష్మికీ, శరణ్యకీ ఎక్కువ స్కోప్‌ ఇచ్చినట్లు కన్పిస్తుంది.

విలన్‌ రోల్‌లో కార్తికేయ ప్రెజెన్స్‌ చాలా బావుంది. చాలా బాగా చేశాడు కూడా. ప్రియదర్శి, పబ్లిషర్‌ పాత్రలో బాగా చేశాడు. వెన్నెల కిషోర్‌, గెటప్‌ శీను కామెడీ వర్కవుట్‌ అయ్యింది. మిగతా పాత్రధారులంతా తమ పని తాము చేసుకుపోయారు.

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ ఎలా వున్నాయ్‌.?

సినిమాటోగ్రఫీ చాలా బావుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగా కుదిరింది. సన్నివేశాల్లో డెప్త్‌ని సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మరింత బాగా ఎలివేట్‌ చేశాయి. పాటలు బావున్నాయి. డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. మరీ ముఖ్యంగా నాని మార్క్‌ సెటైరికల్‌ డైలాగులు బాగా పేలాయి. ఎడిటింగ్‌ విషయంలోనే మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని వుండాల్సింది. లెంగ్తీ సీన్స్‌ సినిమా గమనంలో వేగాన్ని తగ్గిస్తాయి. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమా మూడ్‌కి తగ్గట్టుగా వున్నాయి. నిర్మాణపు విలువలు చాలా బావున్నాయి. కథ, కథనం రెండూ సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి.

ప్లస్‌ పాయింట్స్‌

  • నాని పెర్ఫామెన్స్‌
  • వెన్నెల కిషోర్‌ కామెడీ
  • కార్తికేయ విలనిజం

మైనస్‌ పాయింట్స్‌

  • సాగతీత అన్పించే సన్నివేశాలు
  • కథా గమనానికి అడ్డుపడిన ఒకటి రెండు పాటలు
  • ఊహించగలిగేలా సాగిన కథనం

విశ్లేషణ

నానితో ఇలాంటి కథని డిజైన్‌ చేసినప్పుడు, నాని చుట్టూనే ఫన్‌ని కూడా ఎక్కువ జనరేట్‌ చేసుకుని వుండాల్సింది. ఎందుకంటే, నాని కేపబులిటీ అందరికీ తెలుసు. అదనంగా కమెడియన్స్‌ని పెట్టడం వల్ల సినిమా గమనంలో వేగం మందగించినట్లనిపిస్తుంటుంది. కొన్ని కామెడీ సీన్స్‌ అయితే కథా గమనానికి అడ్డం పడతాయి. ‘రారా..’ పాట ఆకట్టుకుంటుంది. బాగా పిక్చరైజ్‌ చేశారు. అయితే, కొన్ని పాటలు సినిమా వేగాన్ని తగ్గించేసినట్లనిపిస్తాయి. ఫస్టాఫ్‌ ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభమయి, కొంత సాగతీతకు గురవుతుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ని ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా మలచి వుంటే బావుండేదనిపిస్తుంది. ఫస్టాఫ్‌తో పోల్చితే, సెకెండాఫ్‌లో కొంచెం వేగం ఎక్కువ కనిపిస్తుంది. ఓవరాల్‌గా ‘రేసీ స్క్రీన్‌ప్లే’ అయితే కొరవడిందని చెపొచ్చు. కూల్‌గా సాగే సినిమా, నాని ఎనర్జీ ప్లస్‌ నేచురల్‌ పెర్ఫామెన్స్‌, వెన్నెల కిషోర్‌ కామెడీ, కార్తికేయ విలనిజం వెరసి ఓ మంచి సినిమా చూసిన అనుభవాన్ని అయితే మిగుల్చుతాయి. గ్లామర్‌ లేకపోవడం, కాస్త స్లో నెరేషన్‌.. సినిమా నెక్స్‌ట్‌ లెవల్‌కి వెళ్ళడానికి అడ్డుపడతాయి.

ఫైనల్‌ పంచ్‌: నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌.. జస్ట్‌ ఓకే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్‌ మోహన్‌, కార్తికేయ, లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను తదితరులు. సంగీతం: అనిరుద్‌ రవిచందర్‌ ఎడిటర్‌: నవీన్‌ నూలి సినిమాటోగ్రఫీ: మిరోస్లా దర్శకత్వం: విక్రమ్‌ కుమార్‌ నిర్మాణం: మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, రవి శంకర్‌ వై, మోహన్‌ (సివిఎం) విడుదల తేదీ: 13 సెప్టెంబర్‌ 2019 ముందుగా.. 'జెర్సీ' తర్వాత నాని హీరోగా రూపొందిన సినిమా కావడంతో విడుదలకు ముందు సినిమాపై...సినిమా రివ్యూ: గ్యాంగ్‌ లీడర్‌