Switch to English

పొలిటికల్ మైనింగ్: ఎవరు అధికారంలో వున్నా దోపిడీనే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

‘మేం అధికారంలోకి వస్తే మైనింగ్ మాఫియా గుట్టు రట్టు చేస్తాం.. మైనింగ్ కింగ్స్ అంతు చూస్తాం..’ అని ప్రధాన రాజకీయ పార్టీలు చెప్పడం, అధికారంలోకి వచ్చాక, నిస్సిగ్గుగా మైనింగ్ మాఫియాని తమ కనుసన్నల్లో నడిపించడం మామూలే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మైనింగ్ మాఫియా మొదలైందని టీడీపీ నేత పట్టాభి తాజాగా సెలవిచ్చారు. ఔనా.? అదే నిజమైతే, ఐదేళ్ళ కాలంలో మైనింగ్ మాఫియాని ఏం చేశారు.?

మైనింగ్ మాఫియా పేరు చెప్పి, చంద్రబాబు హయాంలో ఎంతమంది రాజకీయ నాయకుల్ని అరెస్టు చేసి జైళ్ళకు పంపించారు.? ప్చ్.. సమాధానం దొరకదు. పైగా, చంద్రబాబు హయాంలో చాలామంది టీడీపీ నేతలు మైనింగ్ మాఫియా డాన్స్.. అన్నట్టుగా అవతారమెత్తారు. అప్పట్లో వైసీసీ, టీడీపీ మైనింగ్ మాఫియాపై విరుచుకుపడింది. మరిప్పుడు, వైసీపీ ఏం చేస్తోంది.? తమ మాట వింటే సరే సరి.. లేదంటే, బెదిరింపులకు దిగుతోంది. మైనింగ్ రంగు మారుతోందేమోగానీ.. మైనింగ్ మాత్రం ఆగడంలేదు. కొన్నాళ్ళ క్రితం యెల్లో మాఫియా, ఇప్పుడు బ్లూ మాఫియా.. అంతే తేడా. అంతిమంగా జరిగేది మాత్రం మైనింగ్ మాఫియానే. దోపిడీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోడ్లను తవ్వేసిపోతున్నారిప్పుడు.. అదీ రాజధాని అమరావతిలో.

మైనింగ్ మాఫియా అనండి.. పొలిటికల్ మైనింగ్ మాఫియా అనండి.. పేరేదైతేనేం.. మట్టి, ఇసుక, కంకర, విలువైన ఖనిజాలు.. దేన్నీ వదలడంలేదు ఈ పొలిటికల్ మాఫియా. టీడీపీ నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీ.. అంటూ కొండపల్లి ప్రాంతంలో రచ్చ చేయడంతో, దానికి దళిత రంగు పులిమిన అధికార పార్టీ, ప్రజల దృష్టిని తెలివిగా డైవర్ట్ చేయగలిగింది. తూర్పుగోదావరి జిల్లా, విశాఖ జిల్లా.. ఆ మాటకొస్తే, మొత్తంగా 13 జిల్లాల్లోనూ మైనింగ్ మాఫియా రాజ్యమేలుతూనే వుంది. ఆయా జిల్లాల్లోని ఆయా ప్రాంతాల్లో ఫలానా మైనింగ్ మాఫియా వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు.

పైకి పొలిటికల్ కుస్తీ, తెరవెనుకాల మైనింగ్ మాఫియా దోస్తీ.. ఇదీ నేటి రాజకీయం. టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి, ఈ మైనింగ్ వివాదాల తలనొప్పి భరించలేక, వైసీపీలో చేరిపోయిన విషయం విదితమే. ఒకాయన లొంగని కారణంగా కేసులు ఎదుర్కొన్నారు, ఎదుర్కొంటూనే వున్నారు. చంద్రబాబు హయాంలో, ప్రకాశం జిల్లాకి చెందిన ఓ మైనింగ్ మాఫియా కింగ్.. టీడీపీ ఒత్తిళ్ళకు భయపడి, వైసీపీ నుంచి టీడీలోకి దూకేసిన విషయం ఎలా మర్చిపోగలం.? అంతిమంగా అందరూ ఒకటే.. దోచేసేది.. విలువైన ఖనిజాన్ని. తోడు దొంగల దోపిడీకి రాష్ట్రం గుల్ల అయిపోతోందంతే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...