Switch to English

అయిపాయె.! వివేకా హత్యకేసు తెలంగాణకి బదిలీ.!

91,241FansLike
57,313FollowersFollow

వైఎస్ వివేకానందరెడ్డి.! మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ.. తెలుగునాట రాజకీయాల్లో వైఎస్ వివేకానందరెడ్డి పేరు తెలియనివారు వుండరు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి స్యానా సోదరుడు వైఎస్ వివేకాందరెడ్డి. అంతేనా, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వయానా చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి.!

2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ వైసీపీ అనుకూల మీడియా పెద్దయెత్తున కథనాల్ని ప్రసారం చేసింది. ఆ ఎన్నికల్లో వైఎస్ వివేకా హత్యకేసుని వైసీపీ ఎంతలా వాడుకుని, రాజకీయంగా లబ్ది పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తొలుత గుండె పోటుగా అభివర్ణించి, ఆ తర్వాత అది హత్యగా తేలడంతో వైసీపీనే కంగారు పడిందన్న ఆరోపణలు లేకపోలేదు. అత్యంత కిరాతకంగా వైఎస్ వివేకానందరెడ్డిని దుండగులు హత్య చేస్తే, దాన్ని గుండెపోటుగా ఎలా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరిగాయి.? అన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే.

అప్పట్లో సీబీఐ విచారణ కోరి, ఆ తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు నాల్కల ధోరణి అవలంభించడమేంటని ఇప్పటికీ విమర్శలు వినిపిస్తుంటాయి రాజకీయ ప్రత్యర్థుల నుంచి. అదంతా పక్కన పెడితే, వైఎస్ వివేకా కుమార్తె హైకోర్టును ఆశ్రయించి మరీ సీబీఐ విచారణను సాధించుకున్నారు. కానీ, ఏం లాభం.? ఇప్పటిదాకా సీబీఐ ఈ కేసులో దోషులెవరన్నది నిరూపించలేకపోయింది.

కేసు విచారణ ఏపీ పరిధిలో జరుగుతుండడం వల్ల విచారణలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే వైఎస్ వివేకా కుమార్తె సుప్రీంకోర్టుని ఆశ్రయించి, కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. వివేకా కుమార్తె కోరికను సర్వోన్నత న్యాయస్థానం మన్నించింది. తెలంగాణలోని సీబీఐ కోర్టుకి ఈ కేసు విచారణను బదిలీ చేసింది సుప్రీంకోర్టు.

ఇప్పటికైనా ఈ కేసులో దోషులెవరో తేలతారా.? ఏళ్ళ గడిచిపోతున్నా, ఈ కేసులో నిజానిజాలెందుకు నిగ్గు తేలడంలేదు.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

విజయ్- లోకేశ్ కనగరాజ్ సినిమా ‘లియో’..! ఆసక్తి పెంచుతున్న టీజర్

ఖైదీ, విక్రమ్ సినిమాలు తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ నటిస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ తో మాస్టర్...

బాలయ్య షో లో కనిపించని చిరు అక్కడ ప్రత్యక్షం అయ్యారు!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్‌ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లేదా చివరి ఎపిసోడ్ లో ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి...

సాయి పల్లవిని పట్టించుకోవడం మానేసి తెలుగు నిర్మాతలు

ఫిదా సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ అమ్మడు సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానం కలుగుతుంది....

అందాలు చూపిస్తూ కెరీర్‌ని నెట్టుకొస్తున్న లెజెండ్రీ స్టార్‌ కిడ్‌

శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా చూడాలని దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీదేవి అభిమానులు కోరుకున్నారు. శ్రీదేవి బతికుండగానే జాన్వీ కపూర్ హీరోయిన్...

సువర్ణసుందరి రివ్యూ: బోరింగ్ ట్రీట్మెంట్

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన తారాగణంగా వచ్చిన ఈ ‘సువర్ణ సుందరి’ ఈరోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో...

రాజకీయం

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ అనిల్.! నవరస నటనా సార్వభౌములు.!

పొరపాటున సినిమాట్లో నటించే నటీనటులకు ‘నటన’ పరంగా అవార్డులు ఇస్తున్నారుగానీ.. అసలంటూ అవార్డులు ఇవ్వాల్సింది రాజకీయ నాయకులకేనట. అలాగని రాజకీయ నాయకులే చెబుతోంటే, ‘కాదు’ అని మనమెలా అనగలం.? అన్న చర్చ జన...

‘నన్ను ఫోన్ లో బెదిరిస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయి’ సజ్జలకు కోటంరెడ్డి కౌంటర్

తనపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన విమర్శలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘నన్ను...

ఉత్త ‘సలహా’కి వృధాగా ఖర్చవుతున్న ప్రజాధనం.!

‘మేం అస్సలు అవినీతికి తావులేని ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్ములు వెళ్ళేలా చేస్తున్నాం..’ అంటోంది వైసీపీ సర్కారు.! సరే.. అది నిజమే అనుకుందాం.! సలహాదారుల సంగతేంటి.? కుప్పలు...

నెల్లూరు పెద్దా‘రెడ్ల’ ముందస్తు రాజకీయం.?

అదేంటో, అధికార పార్టీకి సొంత సామాజిక వర్గంగా చెప్పబడే ‘రెడ్డి’ సామాజిక వర్గం నుంచే ప్రకంపనలు మొదలయ్యాయ్.! నెల్లూరు జిల్లాకి చెందిన ఇద్దరు ‘రెడ్లు’ పార్టీ వీడనున్నారు. మరో ‘రెడ్డి’గారూ అసంతృప్తితో వున్నారు....

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న..! టీడీపీ నేత లక్ష్మీనారాయణ..

లోకేశ్ పాదయాత్రలో తీవ్ర గుండెపోటుకు గురైన హీరో తారకరత్న బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. హీరో బాలకృష్ణ...

ఎక్కువ చదివినవి

ఆసుపత్రిలో చేరిన ఇలియానా..! త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్ష

తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా రాణించిన గోవా బ్యూటీ ఇలియానా ఆసుపత్రిలో చేరింది. ఇటివల ఆమె అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా...

ఒడిశాలో దారుణం..! ఏఎస్సై కాల్పుల ఘటనలో ఆరోగ్య మంత్రి మృతి..

ఏఎస్సై జరిపిన కాల్పుల్లో ఒడిశా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్ దాస్ మృతి చెందారు. ఆదివారం ఉదయం జరిగిందీ ఘటన. తీవ్రంగా గాయపడి భువనేశ్వర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ సాయంత్రం...

వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేయాలని లేదు : కోటంరెడ్డి

అనుమానించే చోట తాను ఉండాలనుకోవడం లేదంటూ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని సాక్షాదారాలతో సహా కోటంరెడ్డి చూపించాడు. తాను చిన్ననాటి...

తారకరత్నని విజయసాయి రెడ్డి కలవడం వెనుక కారణం ఏంటో తెలుసా?

గుండె పోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన తారకరత్నను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించడమేంటి అంటూ అంతా...

సుమపై ప్రశంసలు..! ఆమె సేవాభావానికి నెటిజన్లు ఫిదా..! ఏం చేసిందంటే

యాంకరింగ్, టాక్ షోలతో బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ కలిగిన సుమ.. కార్యక్రమాన్ని రక్తి కట్టించడంలో నేర్పరి. పంచ్ డైలాగులు, అలవోకగా మాట్లాడటంతో మాస్టర్. అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరుస్తూంటుంది. ఇంతటి క్రేజ్ ఉన్న...