అలనాటి అందాల తార భాగ్యశ్రీ గుర్తుందా? మైనే ప్యార్ కియాలో సల్మాన్ ఖాన్ సరసన ఆడిపాడింది ఈ భామ. ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే. తర్వాత ఓంకారం అనే చిత్రంలో నటించింది. బాలకృష్ణ చిత్రం రాణాలో అతని చెల్లలిగా నటించింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించింది లేదు. అయితే రీసెంట్ గా ఈమె మళ్ళీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఒక కన్నడ సినిమా చేసింది. తెలుగులో 2 స్టేట్స్ రీమేక్ లో నటించింది కానీ ఆ సినిమా ఆగిపోయినట్టుంది.
తాజా సమాచారం ప్రకారం భాగ్యశ్రీ ప్రభాస్ సినిమాలో నటిస్తోందట. ఈమె ప్రభాస్ కు తల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ అఫీషియల్ గా డిక్లేర్ చేసాడు. ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్ర చాలా కీలకమని, అయితే వివిధ అషన్లను పరిశీలించిన తర్వాత భాగ్యశ్రీను కన్ఫర్మ్ చేసినట్లు తెలిపాడు. ఈ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేయడం ఖాయమని అంటున్నాడు.
ప్రభాస్ బాహుబలి నుండే ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. తను నటించే సినిమాల్లో నటులు కూడా అన్ని భాషల వారికి కేటర్ చేసేలా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోన్న పూజ హెగ్డే అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో సుపరిచితమే. ఇప్పుడు భాగ్యశ్రీ ఎంట్రీ. అలాగే మిగతా నటీనటుల విషయంలో ప్యాన్ ఇండియా గుర్తింపు ఉన్న నటులనే తీసుకుంటున్నారు. యూవీ క్రియేషన్స్ తో కలిసి కృష్ణం రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన ఒక భారీ సెట్ లో మొదలైన విషయం తెల్సిందే.
976050 796004Check out our site for details about securities based lending and much more. There is info about stock and equity loans as nicely as application forms. 814530
415699 677583Oh my goodness! an incredible post dude. Thanks a ton Nonetheless We are experiencing issue with ur rss . Dont know why Cannot enroll in it. Can there be any person finding identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 328879