Switch to English

జనసేనకి రాపాకపై వేటు వేసే ధైర్యముందా.?

జనసేన పార్టీకి వున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, అసెంబ్లీ సాక్షిగా.. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించడమే కాక, పార్టీ తరఫున.. అంటూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మద్దతిచ్చారు మూడు రాజధానులు, ఇంగ్లీషు మీడియం సహా అనేక విషయాలపై. కానీ, రాపాకపై ఇప్పటిదాకా జనసేన పార్టీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ‘ఆ పార్టీకి వున్న ఒకే ఒక్క ఎమ్మెల్యేని నేను. నా మీద చర్యలు తీసుకునేంత సీన్‌ పార్టీలో ఎవరికీ లేదు’ అని రాపాక వరప్రసాద్‌ పలుమార్లు వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.

ఇదిలా వుంటే, పార్టీలో వున్నామని చెప్పుకుంటూ పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ ఓ ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది. ఇదిప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. నిజమే, జనసేన పార్టీకి చెందిన నేతలుగా చెప్పుకుంటూ, జనసేన పార్టీని బ్యాడ్‌ చేయడంలో కొందరు చూపుతున్న అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో ఈ పైత్యం కాస్తా, జనసేన పార్టీకి సంకటంగా మారింది.

జనసేనకు ఇటీవల లక్ష్మినారాయణ (సీబీఐ మాజీ జేడీ, 2019 ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేసిన అభ్యర్థి) గుడ్‌ బై చెప్పడం వెనుక.. ఈ తరహా దుష్ప్రచారం కూడా ఓ కారణమే. పార్టీ నిర్మాణమంటే.. ఆషామాషీ వ్యవహారం కాదు. పార్టీ లైన్‌కి భిన్నంగా ఎవరూ మాట్లాడకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేసే వ్యవస్థ ఒకటి వుండాలి. కానీ, ఆ పరిస్థితి జనసేన పార్టీలో కన్పించడంలేదు.

ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌, రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఒకటి రాజకీయం, ఇంకోటి సినిమా. ఈ పరిస్థితుల్లో పార్టీ ముఖ్య నేతలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వుంది. అయినా, ప్రెస్‌నోట్లతో కాలయాపన చేయడం వల్ల పార్టీకి ఏమాత్రం ఉపయోగముండదు. ఈ విషయం జనసేన పార్టీ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది.

సినిమా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కు కాస్ట్‌ కట్టింగ్‌ తప్పదా?

రాజమౌళి సినిమా అంటే భారీ బడ్జెట్‌కు పెట్టింది పేరు. ఈగతో సినిమా తీసినా కూడా దానికి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టిన ఘనత రాజమౌళికి...

పవన్‌ ఆ రెండు సినిమాలు ఈ ఏడాది చేయడేమో!

అజ్ఞాతవాసి తర్వాత రెండేళ్ల గ్యాప్‌ తీసుకున్న పవన్‌ కళ్యాణ్‌ కొన్నాళ్ల క్రితం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. కెరీర్‌లో...

మహేష్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మద్య రచ్చ

మహేష్‌ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల...

కరోనాతో అల్లు వారి ‘ఆహా’లో ఢొల్ల బయటపడినది

రాబోయే రోజుల్లో ఓటీటీ రాజ్యం ఏళబోతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వంటి దేశాల్లో ఓటీటీ బిజినెస్‌ చాలా లాభసాటిగా ఉంది. ఇండియాలో...

#AA20 అప్‌డేట్‌ ఇవ్వకుంటే ఊరుకునేలా లేరుగా

అల్లు అర్జున్‌ 20వ చిత్రం సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. రంగస్థలం చిత్రం తర్వాత రెండేళ్ల గ్యాప్‌ వచ్చిన నేపథ్యంలో చాలా కసిగా ఉన్న...

రాజకీయం

జగన్‌ సారూ.. కరోనా ప్రాణం తీసింది చూడూ.!

‘పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకుంటే కరోనా వైరస్‌ నయమైపోతుంది.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే వైరస్‌ తగ్గిపోతుంది..’ అంటూ మొదట్లో కరోనా వైరస్‌ని చాలా తేలిగ్గా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. కరోనా...

వైఎస్‌ జగన్‌ సర్కార్‌ని పవన్‌ ప్రశ్నిస్తే.. ఎదురు దాడి చేయడమేంటి.?

జనసేన అధినేత ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. కష్టం ఎక్కడ వచ్చినా, బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తారాయన. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో పవన్‌ కళ్యాణ్‌ చిత్తశుద్ధి ఏంటన్నది బాధిత...

బోయింగ్ కు కరోనా సెగ: లేఆఫ్ దిశగా…

యావత్ ప్రపంచాన్ని నిలువెల్లా వణికిస్తున్న కరోనా మహమ్మారితో వివిధ రంగాలు ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఓ వైపు మానవాళి ఆరోగ్యానికి సవాల్ గా పరిణమించిన కోవిడ్-19.. మరోవైపు ఆర్థికపరమైన సంక్షోభానికీ కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా...

రెడ్డిగారి నిస్సిగ్గు రాజకీయం.. నవ్విపోదురుగాక ఆయనకేటి.!

విజయసాయిరెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరిది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా వున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ ఆయనే నెంబర్‌ టూ పొజిషన్‌లో వున్నారన్నది జగమెరిగిన సత్యం. ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం...

9 నిమిషాలు.. మళ్ళీ నిరాశపర్చిన నరేంద్ర మోడీ

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇవ్వబోతున్నారనే ప్రకటన నిన్న రావడంతో. ఏం చెబుతారు నరేంద్ర మోడీ.? లాక్‌ డౌన్‌ ఎత్తివేతపై ఆయనేమైనా...

ఎక్కువ చదివినవి

చిరు ఇన్వాల్వ్‌ అవ్వడం వల్ల బాలయ్య, మోహన్‌బాబులు సైలెంట్‌ అయ్యారా?

ఈ కరోనా విపత్తు సమయంలో టాలీవుడ్‌ నుండి పలువురు స్టార్స్‌ తమ మంచి మనసును చాటుకుని భారీ విరాళాలను ప్రకటించిన విషయం తెల్సిందే. సీఎం పీఎం సహాయ నిధికి మాత్రమే కాకుండా సినీ...

కరోనాపై ప్రజలకి వైవిఎస్ చౌదరి స్పెషల్ లెటర్

‘కుశలమా’! ‘నీకు కుశలమేనా’!! అది పాత తెలుగు సినిమా పాటా కాదు, కేవలం నాలుక మీద నుండీ దొర్లిన పదాల కలయికా కాదు. పై పదాల కలయిక.. మనం మన ఆత్మీయుల యోగక్షేమాలను తెలుసుకోవాలనుకునే తొలి ‘పలకరింపు’. మన...

ప్రభాస్ కోసం మరో సెట్ వెయ్యక తప్పలేదుగా.!

'సాహో' తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్ లో పూర్తి ప్రేమకథా చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పీరియడ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీకి 'ఓ డియర్'...

చరణ్‌పై జక్కన్న ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

రామ్‌ చరణ్‌ కెరీర్‌ ఆరంభంలోనే రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రం చేయడంతో ఒక్కసారిగా స్టార్‌ హీరోల సరసన నిలిచాడు. మగధీర చిత్ర రికార్డును చాలా సంవత్సరాల పాటు ఏ సినిమా కూడా బ్రేక్‌...

రెడ్డిగారి నిస్సిగ్గు రాజకీయం.. నవ్విపోదురుగాక ఆయనకేటి.!

విజయసాయిరెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరిది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా వున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ ఆయనే నెంబర్‌ టూ పొజిషన్‌లో వున్నారన్నది జగమెరిగిన సత్యం. ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం...