Switch to English

అమరావతిలో సరే.. పులివెందులలో ఇవ్వగలరా.?

రైతులు, రాజధాని కోసం ఇచ్చిన భూముల్ని ప్రభుత్వం, పేదల ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం కోసం వెచ్చించబోతోంది. ఈ మేరకు ఇప్పటికే అధికారికంగా జీవో కూడా జారీ అవడం కలకలం సృష్టిస్తోంది. పేదలకు ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇస్తామంటే దాన్ని ఎవరైనా కాదనగలరా.? కానీ, ఇక్కడ పరిస్థితి వేరు.

దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా రాజధాని కోసం రైతులు స్వచందంగా తమ భూములిచ్చిన మాట వాస్తవం. ఆ లెక్కన, రైతుల్ని ఏ ప్రభుత్వమైనా నెత్తిన పెట్టుకుని పూజించాలి. దురదృష్టవశాత్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రైతుల్ని పురుగులకంటే హీనంగా చూస్తోంది.

లాఠీలు విరుగుతున్నాయ్‌ రైతుల మీద. అధికార పార్టీ నేతలైతే ఏకంగా.. తమ వాహనాలతో రైతుల్ని ఢీకొట్టించేస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడటం వివాదాలకు తావిస్తోంది. ‘మేం రాజధానికి భూములిచ్చాం.. మా భూముల్ని, ఇంకెవరికో ఇచ్చే హక్కు మీకెక్కడిది.?’ అని అమరావతి రైతులు సరాసరి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు.

‘ఏం, మీ పులివెందులలో.. మీకున్న భూముల్లో రైతులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వొచ్చుగా.? ప్రజల్ని ఉద్ధరించడానికే రాజకీయాల్లోకి వచ్చామంటున్నారు కదా.. మీ ఆస్తుల్ని ప్రజలకు రాసిచ్చెయ్యండి.. మేం రైతులం.. మేం రాష్ట్ర ప్రయోజనాల కోసం భూములిచ్చాం.. మీరు ముఖ్యమంత్రి.. మీ ఆస్తుల్ని ప్రజలకు ఇవ్వలేరా.?’ అని సవాల్‌ విసురుతున్నారు అమరావతిలో 70 రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతులు.

నిజానికి అమరావతి రైతుల డిమాండ్‌లో లాజిక్‌ వుంది. కానీ, ఈ కుళ్ళిన రాజకీయ వ్యవస్థలో, అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆస్తుల్ని పెంచుకుంటారుగానీ.. ఎవరైనాసరే, ఆ ఆస్తుల్ని ప్రజల కోసం వినియోగించేంత పెద్ద మనసు కలిగి వుంటారా.? ఛాన్సే లేదు. ఒక్కటి మాత్రం నిజం.. అమరావతి రైతుల్ని, ఈ ఇళ్ళ స్థలాల వివాదంతో ఇంకా గట్టిగా కెలికేస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఈ తాజా పరిణామాలు ముందు ముందు ఇంకెలాంటి వివాదాలకు తావిస్తాయో వేచి చూడాల్సిందే.

సినిమా

మెగాస్టార్ రీమేక్ లోకి జగ్గూ భాయ్.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా కారణంగా బ్రేక్ పడిన...

మరో స్పెషల్ రికార్డ్ కొట్టేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు నచ్చిన సినిమాల గురించి పోస్ట్ చేయడం...

మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండేలా లేదుగా.!

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ సమయంలో రాజమౌళిని...

లెజండరీ దర్శకుడితో విక్టరీ వెంకటేష్?

దర్శకుడిగా కె రాఘవేంద్రరావు తెలుగు సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా కమర్షియల్ ఫార్మటును కొత్త పుంతలు తొక్కించి రాఘవేంద్రరావు ఎన్నో మరపురాని విజయాలను...

స్పెషల్‌: స్టార్ హీరోతో రెజీనా షార్ట్ ఫిల్మ్

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రెజీనా. ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోవడం తో వెబ్ సిరీస్...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఇళ్ళ పట్టాల పేరుతో వైసీపీ నేతలు దోచేస్తున్నారా.?

జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో అదే రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత కొద్ది నెలలుగా...

మళ్ళీ లాక్‌డౌన్‌.. హైద్రాబాద్‌పై ఏంటీ గందరగోళం.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో మళ్ళీ కరినంగా లాక్‌డౌన్‌ అమలు కాబోతోందట.! గత కొద్ది రోజులుగా విన్పిస్తోన్న ఈ ఊహాగానాలు సగటు హైద్రాబాదీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. ‘హైద్రాబాద్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది’...

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై ఈడీ కేసు

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఈ...

వైసీపీకి మళ్ళీ ‘పీకే’ అవసరం ఎందుకొచ్చినట్లు.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ప్రశాంత్‌ కిషోర్‌ ‘అవసరం’ వచ్చిందట. గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితిపై ‘పీకే’ టీమ్ తో అంచనా వేయించి, పరిస్థితులు తేడాగా వుంటే సరిదిద్దుకునేందుకు పార్టీ...

ఏపీ కరోనా టెస్టుల్లో విశ్వసనీయత ఎంత.?

కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత ఒకరు తనకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్ట్‌ జరిగితే పాజిటివ్‌ అని తేలిందనీ.. అదే తెలంగాణలో టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌గా తేలిందనీ ఆరోపిస్తూ.. కొన్ని ఆధారాల్ని తెరపైకి...

ఎక్కువ చదివినవి

బిగ్‌ స్టోరీ: ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ పేరు వెనుక రాజకీయం.!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే ఏంటి.? అని గ్రామ స్థాయిలో ఎవర్నన్నా ప్రశ్నిస్తే, ‘రాజశేఖర్‌రెడ్డి పార్టీ’, ‘జగన్‌ పార్టీ’ అని అంటుంటారు. కానీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అసలు పేరు వేరు. ఇది...

ఎక్స్ క్లూజివ్: వంశీ పైడిపల్లికి మహేష్ మరో ఛాన్స్, కానీ డైరెక్టర్ గా కాదట.!

మహేష్ బాబు 25వ సినిమా మహర్షి కి దర్శకత్వం వహించిన దర్శకుడు వంశీ పైడిపల్లి మరోసారి మహేష్ చాన్స్ ను దక్కించుకున్నాడు. మహేష్ 27వ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ...

ఎక్స్ క్లూజివ్: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’లో మిల్క్ బ్యూటీ.?

జనసేనాని అలియాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఫిల్మ్ గా చేస్తున్న సినిమా 'వకీల్ సాబ్'. పవన్ రెండు విభిన్న గెటప్స్ లో లాయర్ గా కనిపించనున్న ఈ సినిమా లాక్...

మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండేలా లేదుగా.!

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ సమయంలో రాజమౌళిని మీ తర్వాతి ప్రాజెక్ట్ ఏంటని అడిగితే...

అబ్జర్వేషన్‌: ఓటీటీ దెబ్బకి థియేటర్స్ ఔట్‌.!

ఇకపై థియేటర్‌కి వెళ్ళి సినిమా చూసే అవకాశం వుండదా.? ఏమో, ఇప్పుడే ఓ క్లారిటీకి వచ్చేయలేంగానీ.. పరిస్థితులు మాత్రం కొంత అనుమానాస్పదంగానే కన్పిస్తున్నాయి. ‘కరోనా వైరస్‌ ఎక్కువ కాలం వుండదు.. ఒక్కసారి వ్యాక్సిన్‌...