టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు.. ఇప్పుడు గ్రామ వాలంటీర్లు.. పెద్దగా తేడాలేమీ లేవు. అధికార పార్టీకి కొమ్ము కాయడమే వారి పని. వేతనాలు ఇచ్చి మరీ, పార్టీ తరఫున పబ్లిసిటీ చేయించుకుంటోంది వైఎస్సార్సీపీ, గ్రామ వాలంటీర్ల ద్వారా.. ఆ వేతనాలు మళ్ళీ ప్రభుత్వ ఖజానా నుంచే వెళుతుండడం గమనార్హమిక్కడ.
ప్రభుత్వం తెరపైకి తెచ్చిన సంక్షేమ పథకాల్ని ప్రజలకు చేరవేయడం గ్రామ వాలంటీర్ల విధి. అంతే కాదు, ఆ పథకాల మాటున, అధికార పార్టీ తరఫున పబ్లిసిటీ చేసి పెట్టడం.. అసలు సిసలు పని. రైతు భరోసా సహా అనేక పథకాలకు సంబంధించి స్టిక్కర్లు వేసే బాధ్యతని గ్రామ వాలంటీర్ల మీద ప్రభుత్వం బలవంతంగా రుద్దతోంది.
‘స్టిక్కర్లేయడానికి వస్తున్నారు..’ అంటూ గ్రామ వాలంటీర్లపై కొన్ని చోట్ల ప్రజల నుంచి తిరస్కారం ఎదురవుతోంది. లబ్దిదారుల్లో కొంతమందైతే, గ్రామ వాలంటీర్ల ముందే.. వారు అంటించిన స్టిక్కర్లను చించి పారేస్తున్నారు. ‘ఇది ప్రభుత్వం ప్రజలకు విధిగా చేయాల్సిన పని.. దానికి పార్టీ రంగులు అద్దడమేంటి.?’ అని వాలంటీర్లను ప్రజలు నిలదీస్తున్న సందర్భాలు కూడా కన్పిస్తున్నాయి.
‘టీడీపీ హయాంలోనూ ఇదే జరిగింది.. వైసీపీ హయాంలోనూ అదే జరుగుతోంది..’ అని వైసీపీ నేతలు ఈ వ్యవహారంపై చెప్పుకుంటోంటే, ‘అలాంటప్పుడు, టీడీపీ పాలనకీ.. వైసీపీ పాలనకీ తేడా వున్నట్టా.? లేనట్టా.?’ అని సాధారణ ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం.. గ్రామ వాలంటీర్లలో దాదాపుగా అందరూ వైసీపీ కార్యకర్తలేనని సాక్షాత్తూ వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి స్పష్టం చేసిన విషయం విదితమే.
అలాంటప్పుడు, పార్టీ నుంచి వాలంటీర్లకు వేతనాలు చెల్లించాలిగానీ, ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు చేయడమేంటన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అన్నట్టు, ఆటోల మీద కూడా వైసీపీ స్టిక్కర్లు కనిపిస్తున్నాయి.. ఇవి సాక్షాత్తూ పోలీసులు అంటిస్తున్న స్టిక్కర్లు కావడం.. వైసీపీ పాలనలోని ‘గొప్పతనాన్ని’ చెప్పకనే చెబుతున్నాయి.
904485 596999Very good post. I previousally to spend alot of my time water skiing and watching sports. It was quite possible the very best sequence of my past and your content kind of reminded me of that period of my life. Cheers 619619
680179 276121This internet internet site is my breathing in, quite excellent pattern and perfect content . 818605
436302 892682Some truly select articles on this internet internet site , bookmarked . 87546