ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. లేకపోతే, మూడు రాజధానుల నినాదాన్ని వదిలేసి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ రాజధాని నినాదాన్ని ఎందుకు భుజానికెత్తుకున్నట్లు.?
మాజీ ఎంపీ, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి సీబీఐ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేశారు. హైద్రాబాద్ న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. మరోపక్క, సీబీఐ యెదుట వైసీపీ నేత, ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.
కాగా, అవినాష్ రెడ్డి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన నవీన్ అనే వ్యక్తితో ఆ రోజు.. అంటే వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు పలు మార్లు మాట్లాడారంటూ టీడీపీ అనుకూల మీడియాలో కథనాలొస్తున్నాయి. అతనికీ సీబీఐ నోటీసులు పంపిందట.
ఇంకోపక్క, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళాలనుకుని ప్రత్యేక విమానాన్ని పురమాయిస్తే, దాంట్లో సాంకేతిక లోపం తలెత్తింది. అదో పెద్ద రచ్చ. ఎలాగోలా ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి, అక్కడ ‘విశాఖపట్నమే రాజధాని’ అంటూ వ్యాఖ్యానించారాయె.
ఒకదానితో ఒకటి పొంతన లేని సంఘటనలు జరిగాయా.? అన్నిటికీ పెర్ఫెక్ట్ లింక్ వుందా.? ఈ విషయమై మళ్ళీ పెద్ద రచ్చే జరుగుతోంది. ఉద్దేశ్యపూర్వకంగా వివేకా డెత్ మిస్టరీ వ్యవహారం నుంచి జనం ఆలోచనల్ని డైవర్ట్ చేయడానికి, విశాఖ రాజధాని అంశాన్ని ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారన్నది ఓ వాదన.
ఓన్లీ క్యాపిటల్ విశాఖ.. అన్నట్లుగా వున్నాయి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. ‘సీమ హక్కుల కోసం..’ అంటూ తొడకొట్టిన కొందరు వైసీపీ నేతలు, ఇప్పుడసలు జ్యుడీషియల్ క్యాపిటల్ ప్రస్తావనే తీసుకురావడంలేదు. ఏం మాయ దీని వెనుక దాగి వుందబ్బా.?
783482 93940This sort of wanting to come to a difference in her or his lifestyle, initial generally Los angeles Excess weight weightloss scheme is really a large running in as it reached that strive. weight loss 205991
343816 321080Several thanks for sharing this fine piece. Extremely fascinating suggestions! (as always, btw) 998520
32913 896828Id need to have to consult you here. Which isnt some thing Which i do! I enjoy reading a post that can make men and women feel. Also, appreciate your permitting me to comment! 445327