Switch to English

బాలయ్య నుంచి కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ‘వీరసింహారెడ్డి’లో వున్నాయి.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ జనవరి 12, 2023న సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి మాటలు అందించిన స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా విలేఖరు సమావేశంలో ‘వీరసింహారెడ్డి’ చిత్ర విశేషాలని పంచుకున్నారు .

‘వీరసింహారెడ్డి’ డైలాగ్స్ కంప్లీట్ మాస్ గా వుండబోతున్నాయా ?

‘వీరసింహారెడ్డి’ లో పక్కా మాస్ డైలాగ్స్ వుంటాయి. బాలకృష్ణ గారిని అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో, ఎలాంటి డైలాగ్స్ వినాలని అనుకుంటారో అన్నీ ఇందులో ఉంటాయి.

బాలకృష్ణ గారి లాంటి పెద్ద స్టార్ హీరోకి డైలాగ్స్ రాస్తున్నపుడు ఒత్తిడి ఫీలయ్యారా ?

బాలకృష్ణ గారి నాలుగు చిత్రాలకు పని చేశాను. నేను ఎప్పుడూ ఒత్తిడి తీసుకోలేదు. ఒత్తిడికి లోనైతే అవుట్ పుట్ సరిగ్గా రాదు.

వీరసింహరెడ్డి కథ దర్శకుడు చెప్పినపుడు అందులో కొత్తగా అనిపించిన పాయింట్ ఏమిటి ?

వీరసింహరెడ్డి కథే కొత్తది. ఈ కథలో ప్రేక్షకులు ఇంతకుముందు చూడని ఓ అద్భుతమైన కొత్త పాయింట్ వుంది. మాస్ ఆడియన్స్ కి, క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కి అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి.

వీరసింహరెడ్డి లో మీకు సవాల్ గా అనిపించిన అంశం ఏమిటి ?

నాకు ప్రతి కథ ఒక సవాలే. ఒక సినిమాకి రాస్తున్నపుడు సవాల్ గా తీసుకునే రాస్తాను. కథలో వున్న సోల్ ని ఎలివేట్ చేయడానికి ప్రతి రచయిత కష్టపడతాడు.

ఈ కథ విషయంలో దర్శకుడికి ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా ? బాలయ్య గారు ఏమైనా మార్పులు చెప్పారా ?

అవి సహజంగా జరిగిపోతుంటాయి, నాకు అనిపించిది నేను చెబుతూ వుంటాను.

బాలయ్య గారిలో వున్న గొప్ప విషయం ఏమిటంటే ఒకసారి కథ కి ఓకే చెప్పిన తర్వాత ఇక అందులో వేలు పెట్టరు.

దర్శకుడు గోపిచంద్ మలినేని తో పని చేయడం గురించి ?

గోపిచంద్ మలినేని గారితో నాకిది రెండో సినిమా. మా మధ్య మంచి స్నేహం వుంది. కథ విషయంలో చాలా మంచి చర్చలు జరుగుతాయి.

గతంలో సంక్రాంతికి బాలకృష్ణ గారి గౌతమీపుత్రశాతకర్ణి, చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 విడుదల అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఇద్దరి సినిమాలు సంక్రాంతికి విడుదలౌతున్నాయి. ఎలా అనిపిస్తుంది ?

బాలకృష్ణ గారి గౌతమీపుత్రశాతకర్ణి, చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 నేనే రాశాను. అదొక మర్చిపోలేని క్షణం. ఈ రోజు మరోసారి బాలకృష్ణ, చిరంజీవి గారి సినిమాలు వస్తున్నాయి. ఇదో పండగ. చిరంజీవి గారి సినిమాకి నేను రాయకపోయినా అదీ నా సినిమానే. బాబీ నా స్నేహితుడు. నేను అంటే చిరంజీవి గారికి ఎంతో అభిమానం. ఒకే నిర్మాణ సంస్థ. అదీ నా సినిమాతోనే సమానం.

మైత్రీ మూవీ మేకర్స్ గురించి ?

నేను చూసిన నిర్మాతల్లో అద్భుతమైన నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. వాళ్ళతో ఒకసారి పని చేసిన వారు మళ్ళీ మళ్ళీ పని చేయాలని అనుకుంటారు.

దర్శకత్వం పై ఆలోచనలు ఉన్నాయా ?

దర్శకత్వం పై ప్రస్తుతానికి ద్రుష్టి లేదు. రచయిత కావాలని వచ్చాను. రచయితగా వున్నాను. ఈ ప్రయాణం ఆనందంగా వుంది.

ప్రస్తుతం రాస్తున్న చిత్రాలు ?

ప్రాజెక్ట్ కె వుంది. హరిహర వీరమల్లు, రామ్ చరణ్- శంకర్ గారి సినిమా జరుగుతోంది. అలాగే అర్జున్ గారి సినిమా, కెఎస్ రామారావు గారి తో ఒక సినిమా చేస్తున్నా.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...