Varun Tej- Lavanya Tripathi: అందరి అనుమానమే నిజమయ్యేలా కనిపిస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈనెల 9న వీరి నిశ్చితార్థం జరగనుందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మెగా కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజున మెగా హీరోలు అందరూ షూటింగ్ కి బ్రేక్ ఇవ్వనున్నారట.
ప్రస్తుతం వరుణ్ తన లేటెస్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున’ చిత్ర షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నాడు. లావణ్య హైదరాబాద్ లోనే ఉంది. నిశ్చితార్థం ఉండటంతో వరుణ్ హైదరాబాద్ తిరిగి రానున్నాడు.
ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీతో కలిసి లావణ్య సందడి చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
2017 లో వచ్చిన ‘మిస్టర్’ సినిమాతో వరుణ్-లావణ్య తొలిసారిగా జతకట్టారు. ఆ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాలోనూ వీళ్లిద్దరు కలిసి నటించారు. అప్పుడే వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.