గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన విషయం విదితమే. అయితే, ఆ రాజీనామాని ఇప్పటిదాకా టీడీపీ అధినేత చంద్రబాబు ఆమోదించలేదు. మరోపక్క, వల్లభనేని వంశీ ఇప్పటిదాకా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌కి తన రాజీనామా లేఖని పంపలేదు.
ఇంతకీ ఏం జరుగుతోంది.? వైసీపీ నుంచి వల్లభనేని వంశీకి ‘తగిన హామీ’ దక్కలేదా.? తెలుగుదేశం పార్టీలో కొనసాగేందుకే ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారా.? బీజేపీ వైపుకు వెళ్ళాలనే ఆలోచన కొత్తగా చేస్తున్నారా.? ఇలా గన్నవరంలో వల్లభనేని వంశీ మద్దతుదారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ‘వల్లభనేని వంశీ వల్ల పార్టీకి ఉపయోగం లేదు.. ఆయనతో లాభం కంటే నష్టమే ఎక్కువ..’ అని టీడీపీ సీనియర్ నేత ఒకరు ఆఫ్ ది రికార్డ్‌గా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదే అభిప్రాయం, వైసీపీలో కూడా వ్యక్తమవుతోందట. ‘ఆయనతో ఎదురయ్యే తలనొప్పిని మనం భరించలేం.. ఆయన వైసీపీలోకి వస్తే, పార్టీలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తారు..’ అంటూ కృష్ణా జిల్లాకి చెందిన వైసీపీ ముఖ్య నేత ఒకరు అధినేత వైఎస్ జగన్‌కి సూచించారట.
మరోపక్క, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాత్రం వల్లభనేని వంశీని బీజేపీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, గత కొన్నాళ్ళుగా మీడియాకి దూరంగా వుంటున్న వల్లభనేని వంశీపై కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతోందట. ‘ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.. వైసీపీ వైపు దారులు మూసుకుపోయినట్లే..’ అని వల్లభనేని అనుచరవర్గం చెప్పుకుంటోంది.
501132 789252Yeah bookmaking this wasnt a risky determination outstanding post! . 288050
804675 188726Sweet internet site, super pattern , real clean and utilize genial . 407141
666509 558663I consider something truly fascinating about your web site so I saved to fav. 194187