Vizag Steel Plant: ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిందా..? కేంద్ర ఉక్కు శాఖ సహాయక మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే (faggan singh kulaste) వ్యాఖ్యలు ఇదే నిరూపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రైవేటుపరంపై ముందుకు వెళ్లడంలేదని కీలక ప్రకటన చేశారు. విశాఖలోని పోర్టు కళావాణి స్టేడియంలో నిర్వహించిన రోజ్ గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.
‘ప్రస్తుతానికి విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ను ప్రైవేటుపరం చేయాలని అనుకోవడం లేదు. దీనికంటే ముందు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) ను బలోపేతం చేయడంపై దృష్టి సారించాం. స్టీల్ ప్లాంట్లో కొత్త విభాగాలు కూడా ప్రారంభిస్తున్నాం. ముడిసరుకు లభించే ప్రక్రియపై దృష్టి పెట్టాం. ప్లాంట్ పూర్తిస్థాయి సామర్ధ్యంలో పని చేసేలా చూస్తున్నాం. ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, అధికారులు, కార్మికులతో చర్చిస్తున్నా’మని అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) బిడ్డింగ్ లో తెలంగాణ (Telangana) పాల్గొనడం ఓ ఎత్తుగడగా అభివర్ణించారు. కొంతకాలంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర సహాయక మంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.