Switch to English

రగులుతున్న తెలంగాణ.. కేసీఆరూ, ఇదేం పాలన సారూ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

తెలంగాణ ఉద్యమ కాలం నాటి పరిస్థితుల్ని మళ్ళీ ప్రత్యక్షంగా చూస్తున్నాం. అప్పుడంటే ప్రతి చిన్న విషయానికీ ఆంధ్రోళ్ళ మీద నెపం నెట్టేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఇప్పుడు నోటికి ‘తాళం’ వేసేసుకున్నట్లుగా కన్పిస్తున్నారు. నిజానికి, ‘తెలంగాణ ఆర్టీసీ కార్మికుల వెనకాల సీమాంధ్రుల కుట్ర వుంది..’ అంటూ చాలా తేలిగ్గా టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపణలు చేసేవాళ్ళే. కానీ, ఎందుకో కేసీఆర్‌ ‘సారు’ నుంచి, ఆ తరహా సంకేతాలు గులాబీ శ్రేణులకు వెళ్ళలేదు.

బహుశా, ఆ కోణంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెని కించపరిస్తే.. తెలంగాణ సమాజం మొత్తం ఛీత్కరించుకుంటుందనే ‘సోయ’ కాస్తో కూస్తో కేసీఆర్‌కి కలిగినట్లుంది. టీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యడం, చెయ్యకపోవడం వేరే విషయాలు. ముందంటూ ప్రభుత్వం తరఫున చర్చలకు దిగితే, చాలా తేలిగ్గా వివాదం సద్దుమణిగిపోతుంది.

‘సారూ.. మీ బిడ్డలాంటోడ్ని నేను.. మీరిచ్చిన హామీ మేరకే మా సమస్యల్ని పరిష్కరించమంటున్నాం.. ఇప్పుడన్నా ఓ మాట మాట్లాడండి మాతో..’ అంటూ టీఆర్టీసీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తోన్న అశ్వత్థామరెడ్డి మీడియా సాక్షిగా కేసీఆర్‌కి విజ్ఞప్తి చేస్తున్నారు. ‘సెల్ఫ్‌ డిస్మిస్డ్‌..’ అనే పదం కేసీఆర్‌, ఆర్టీసీ కార్మికులపై ఉపయోగించి వుండకపోతే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదు.

ఆర్టీసీ ఆస్తుల విషయంలో తెరవెనుకాల ఏదో తతంగం నడుస్తోందనీ.. ఆ కారణంగానే కేసీఆర్‌ ఈ విషయంలో మొండిగా పట్టుదలకు పోతున్నారనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రగతిభవన్‌ని ముట్టడించేందుకు వివిధ రాజకీయ పార్టీలు విఫలయత్నం చేస్తున్నాయి. మరోపక్క, అరెస్టులతో ఉద్యమంపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. ‘అబ్బే, బంద్‌ ప్రభావం అస్సలేమీ లేదు..’ అంటూ తన అనుకూల మీడియాతో మొన్నటి తెలంగాణ బంద్‌పై కేసీఆర్‌ దుష్ప్రచారం చేయించారుగానీ.. వాస్తవమేంటో తెలంగాణ ప్రజానీకానికి అర్థమయ్యింది. ఇప్పుడీ ప్రగతిభవన్‌ ముట్టడి కార్యక్రమం చుట్టూ జరుగుతున్న రగడని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

ఎక్కువ చదివినవి

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...