Nayanthara: తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవడం నచ్చదని అగ్ర నటి నయనతార (Nayanthara) అన్నారు. ఇటివల తాను ప్రధాన పాత్రలో నటించగా డిసెంబర్ 1న విడుదలైన ‘అన్నపూరణి’ (Annapoorani) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. లేడీ సూపర్ స్టార్ అని అందరూ పిలవడంపై ఎదురైన ప్రశ్నకు ఆమె మాట్లాడారు.
‘ఇప్పుడు నన్ను అందరూ లేడీ సూపర్ స్టార్ అంటున్నారు. అలా పిలవడం నాకు నచ్చదు. అలా ఎవరు పిలిచినా నన్ను తిట్టినట్టు అనిపిస్తుంది. రీసెంట్ హిట్ జవాన్ తర్వాత మరింతమంది నన్ను అలానే పిలుస్తున్నారు. అదంతా వారి అభిమానంగా భావిస్తా. కాకపోతే.. నేను ఇబ్బందిలా ఫీల్ అవుతాను. ఇంతమంది అభిమానం పొందడం అంటే సినీ ఇండస్ట్రీ వల్లే. ఇదొక గౌరవం’ అని అన్నారు.
నయనతార కెరీర్లో 75వ సినిమాగా ‘అన్నపూరణి’ తెరకెక్కింది. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయి మాంసాహార రెస్టారెంట్ పెట్టుకోవాలని.. చెఫ్ కావాలనకునే కలను ఎలా నెరవేర్చుకుందనే కథాంశంతో సినిమా తెరకెక్కింది.