Switch to English

విజయసాయిరెడ్డిపై ట్రోలింగ్‌.. నెవ్వర్‌ బిఫోర్‌. ఎవ్వర్‌ ఆఫ్టర్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

వైసీపీ ఎంపీ, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కరోనా బారిన పడిన విషయం విదితమే. విజయసాయిరెడ్డితోపాటు ఆయన పీఏకి కూడా కరోనా సోకిందనీ, ఇద్దరూ హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనీ వార్తలొస్తున్నాయి. మరోపక్క, విజయసాయిరెడ్డి కనీ వినీ ఎరుగని రీతిలో ట్రోలింగ్‌ ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘వ్యాధితో పోరాడాలి.. వ్యాధిగ్రస్తులపై చిన్నచూపు తగదు’ అన్నది వాస్తవం.

కానీ, విజయసాయిరెడ్డి గతంలో వేసిన ట్వీట్లను, చేసిన కామెంట్లను చాలామంది ప్రస్తావిస్తూ సోషల్‌ మీడియాలో ‘ట్రోల్‌’ చేస్తున్నారు. మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, తనకు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సకు అవకాశమివ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తే, ‘మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులు అద్భుతంగా వున్నాయి..’ అని చెప్పే క్రమంలో, అచ్చెన్నాయుడు అనారోగ్యంపై విజయసాయి చేసిన వెటకారాలు అన్నీ ఇన్నీ కావు.

కరోనా వైరస్‌ చుట్టూ విజయసాయిరెడ్డి వేసిన ట్వీట్లు, వాటిల్లో విపక్ష నేతలపై సెటైర్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాటన్నిటినీ నెటిజన్లు ఇప్పుడు ‘కోట్‌’ చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ‘కరోనా ప్రొటెక్టివ్‌ కిట్స్‌’ని అత్యంత విరివిగా వాడేసిన అతి కొద్దిమంది పొలిటీషియన్లలో విజయసాయిరెడ్డి కూడా ఒకరు. అలాంటి విజయసాయిరెడ్డి కరోనా వైరస్‌ బారిన పడటమేంటి.? అన్నది ఇంకొందరి ప్రశ్న.

హైద్రాబాద్‌లో కరోనా పాజిటివ్‌గా తేలింది గనుక.. హైద్రాబాద్‌లో చికిత్స పొందుతున్నారని వైసీపీ నేతలు, వైసీపీ మద్దతుదారులు బుకాయించడం బాగానే వుంది.! కానీ, హైద్రాబాద్‌లోనే ఏదో ఒక ప్రభుత్వాసుపత్రిలో చేరి వైద్య చికిత్స పొందవచ్చు కదా.? ‘కరోనా వైరస్‌.. వస్తుంది, పోతుంది.. ప్రత్యేకంగా చికిత్స ఏమీ లేదు.. పారాసిటమాల్‌ వేసుకుంటే సరిపోతుంది..’ అంటూ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పలు మార్లు చెప్పిన విషయాన్నీ విజయసాయిరెడ్డి విషయంలో ఉటంకిస్తున్నారు చాలామంది నెటిజన్లు.

అరరె, విజయసాయిరెడ్డికి ఎంత కష్టమొచ్చింది.? విమర్శలు, నెటిజన్ల కామెంట్లను పక్కన పెడితే, విజయసాయిరెడ్డి త్వరగా కరోనా వైరస్‌ నుంచి కోలుకోవాలని కోరుకుందాం. గతంలో చేసిన ‘అతి’ కారణంగా ఆయన మీద ఈ తరహా విమర్శలు, సెటైర్లు పడుతున్నాయిగానీ.. ఆయనతో ఎవరికి మాత్రం వ్యక్తిగత వైరం వుంటుంది.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...