ఒకప్పుడు హాకీ పేరు చెప్తే ఇండియానే గుర్తుకు వచ్చేది. అంతటి ఘన కీర్తి ఉన్న ఇండియాలో హాకీకి ప్రాచుర్యం తగ్గుతుంది. వరుసగా ఓటముల వల్ల హాకీపై భారత ప్రేక్షకులు ఆసక్తి కోల్పోయారు అనడంలో సందేహం లేదు. అయినా కూడా ఈసారి ఒలింపిక్స్ లో భారత పురుష మరియు మహిళ జట్లు సెమీస్ కు వెళ్లి పతకంపై ఆశలు కలిగిస్తున్నారు. ఇటీవలే మెన్స్ హాకీ జట్టు సెమీస్ కు వెళ్లగా ఈసారి మహిళ హాకీ జట్టు ఆస్ట్రేలియాపై విజయంతో సెమీస్ కు వెళ్లింది. ఈ విజయంతో మహిళ జట్టు పతకంపై ఆశలు కలిగిస్తోంది.
మూడు సార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మహిళ హాకీ జట్టు పై విజయం సాధించడం అంటే చాలా గొప్ప విషయం అంటూ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. మహిళ జట్టు ఇదే జోరును కొనసాగించి విజయాలను దక్కించుకుంటే పతకంతోనే రావడం ఖాయం అంటున్నారు. గత ఒలింపిక్స్ లో గ్రూప్ దశలోనే భారత హాకీ జట్టు వెను తిరగ్గా ఈసారి మాత్రం సెమీస్ కు వెళ్లడం జరిగింది. ఆస్ట్రేలిపై 1 – 0 తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం ద్వారా సునాయాసంగానే సెమీస్ కు చేరడం జరిగింది.
519781 372775You completed several nice points there. I did a search on the problem and discovered practically all individuals will have the same opinion with your blog. 723976
77883 659236Any person several opportune pieces, it comes surely, as well as you bring in crave of various the numerous other types of hikers close to you with hard part your question. pre owned awnings 407912