Switch to English

ఆయన్ను  మైండ్‌లో పెట్టుకునే ‘చారి 111’ రాశా – దర్శకుడు కీర్తీ కుమార్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,802FansLike
57,764FollowersFollow

‘మళ్ళీ మొదలైంది’తో దర్శకుడిగా పరిచయమైన టీజీ కీర్తి కుమార్… ఆ తర్వాత తీసిన సినిమా ‘చారి 111’. ‘వెన్నెల’ కిశోర్ టైటిల్ రోల్ చేశారు. ఆయన సరసన సంయుక్తా విశ్వనాథన్ నటించారు. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ…

కీర్తి కుమార్ గారు… తెలుగులో ‘మళ్ళీ మొదలైంది’ సినిమా చేశారు. దానికి ముందు మీరు ఏం చేశారు? మీ కెరీర్ గురించి చెప్పండి!

నేను సహాయ దర్శకుడిగా ఎవరి దగ్గర పని చేయలేదు. ఎడిటర్ గా నా కెరీర్ స్టార్ట్ చేశా. విజువల్ కమ్యూనికేషన్ కోర్స్ చేశా. టీవీ కమర్షియల్స్, కార్పొరేట్ ఫిలిమ్స్ ఎడిట్ చేశా. కాలేజీ చదివేటప్పుడు పాకెట్ మనీ కోసం టీవీ సీరియల్స్ ఎడిటింగ్ కూడా చేశా. తర్వాత బెంగళూరు వెళ్లి యాడ్ ఫిల్మ్స్ ఎడిటింగ్ చేశా. కొన్ని యాడ్ ఫిల్మ్స్ కూడా డైరెక్ట్ చేశా. సుమారు పదేళ్లు యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాను. దర్శకుడిగా నా తొలి సినిమా ‘మళ్ళీ మొదలైంది’.

‘చారి 111’ ఎలా మొదలైంది?

నేను దర్శకత్వం వహించిన ‘మళ్ళీ మొదలైంది’లో ‘వెన్నెల’ కిశోర్ కమెడియన్ రోల్ చేశారు. ఆ సినిమా చేసేటప్పుడు ‘చారి 111’ ఐడియా చెప్పాను. ఆయనతో చాలా రోజుల నుంచి ఇటువంటి సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఆయన స్క్రిప్ట్ సెండ్ చేయమని అడిగారు. నేరేషన్ ఇవ్వమనలేదు. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఓకే చెప్పారు.

మీకు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది? ముందు ఎవరికి చెప్పారు?

‘చారి 111’కు ఇన్స్పిరేషన్ ‘పింక్ పాంథర్’, ‘జానీ ఇంగ్లీష్’ వంటి హాలీవుడ్ ఫిలిమ్స్. నాకు అటువంటి సినిమాలు ఇష్టం. నేను వెన్నెల కిశోర్ పాన్. ‘జానీ ఇంగ్లీష్’ ఫిల్మ్ చూసినప్పుడు నేను ఇండస్ట్రీలోకి ఎంటరైతే ఆయనతో అటువంటి సినిమా తప్పకుండా చేయాలని అనుకున్నాను. నా ఫస్ట్ సినిమాలో ఆయన కమెడియన్ రోల్ చేశారు. తర్వాత ఆయనతో సినిమా చేశా. ఇటువంటి సినిమాలకు కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన సినిమాలు చూస్తే లీడ్ యాక్టర్లను మైండ్ లో పెట్టుకుని సినిమాలు చేసినట్టు ఉంటాయి. కిశోర్, మురళీ శర్మ గారిని మనసులో పెట్టుకుని ఈ సినిమా స్క్రిప్ట్ రాశా. తర్వాత విలన్, కాన్‌ఫ్లిక్ట్ ఇష్యూ వచ్చాయి.

స్పై యాక్షన్ అంటే సీరియస్ సబ్జెక్ట్. వెన్నెల కిశోర్ ని దృష్టిలో పెట్టుకుని కామెడీ యాడ్ చేశారా?

లేదండీ. సినిమా జానర్ వచ్చి స్పై యాక్షన్ కామెడీ ఫిల్మ్. ‘ జేమ్స్ బాండ్’ చూస్తే స్పై యాక్షన్. ‘జానీ ఇంగ్లీష్’ చూస్తే… స్పై యాక్షన్ కామెడీ. నాది రెండో కేటగిరీ సినిమా. కిశోర్ గారిని మైండ్ లో పెట్టుకుని స్క్రిప్ట్ రాశా. ఆయన ‘నో’ అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది కాదు.

ఇంగ్లీష్ సినిమాల పేర్లు చెబుతున్నారు. తెలుగులో ఇన్స్పిరేషన్ ఏమీ లేదా?

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారి ‘రుద్రనేత్ర’ ఉంది కదా! ఆ ఇన్స్పిరేషన్ తో మా సినిమాలో స్పై ఏజెన్సీకి ‘రుద్రనేత్ర’ అని పేరు పెట్టాను. ‘చంటబ్బాయ్’ సినిమాను మర్చిపోకూడదు. అందులో చిరంజీవి గారు డిటెక్టివ్. మా సినిమాలో హీరో స్పై రోల్.

మురళీ శర్మను తీసుకోవడానికి కారణం?

వెన్నెల కిశోర్ గారు బాస్ ను ఇరిటేట్ చేస్తారు. ఆ పాత్రను ఆన్ స్క్రీన్ సీరియస్ గా కనిపించే యాక్టర్ కావాలని అనుకున్నా. ఎంత సీరియస్ గా ఉంటే కామెడీ అంత పండుతుంది. అందుకని మురళీ శర్మ గారిని అప్రోచ్ అయ్యాం.

వెన్నెల కిశోర్ చేసిన సినిమాల్లో ఎందులో కామెడీ అంటే మీకు ఇష్టం?

ఆయన బ్రిలియంట్ యాక్టర్. ఆ తర్వాత కమెడియన్. ఎన్నో సినిమాల్లో ఆయన కామెడీ అద్భుతంగా చేశారు. నాకు ఆయనలో నటుడు ఇష్టం. ‘ఓకే ఒక జీవితం’ సినిమాలో చాలా సీరియస్ పోర్షన్స్ ఉన్నాయి. వాటిలో బాగా నటించారు. కామెడీ అవసరమైనప్పుడు కామెడీ చేస్తారు. ‘గూఢచారి’లో కూడా సీరియస్ సీన్స్ బాగా చేశారు.

విలన్ ఎవరో చూపించలేదు. అతన్ని ఎందుకు దాచారు?

విలన్ మాస్క్ ఎందుకు వేసుకుంటాడు అనేదానికి ఒక కారణం ఉంది. ప్రత్యేకంగా దాచాలని ఏమీ అనుకోలేదు. కథలో అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. దాన్ని మార్కెటింగ్ కోసం ఉపయోగించాం.

‘మళ్ళీ మొదలైంది’, ‘చారి 111’ మధ్య స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని అనుకున్నారా? లేదంటే వెన్నెల కిశోర్ ఓకే చేశారు కనుక ఈ సినిమా చేశారా?

భవిష్యత్తులో స్టార్ హీరోలతో తప్పకుండా సినిమాలు చేయాలని ఉంది. ‘వెన్నెల’ కిశోర్ గారు ఓకే చేయడంతో ‘మళ్ళీ మొదలైంది’ తర్వాత ఈ సినిమా చేశా. నాకు యాక్షన్ ఎంటర్టైనర్స్ చేయాలని ఉంది. దానికి ముందు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా! రచయితగా, దర్శకుడిగా, ప్రేక్షకుడిగా ఈ సినిమా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.

సీక్వెల్స్ చేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది!

ట్రైలర్ చూస్తే… రుద్రనేత్ర స్పై ఏజెన్సీ ఉంటుంది. అందులోకి మరింత మంది హీరోలను తీసుకు రావాలని ఉంది. ‘చారి 111’కు కూడా సీక్వెల్ ప్లాన్ ఉంది. ఈ యూనివర్స్ లో ఏ సినిమా చేసినా స్పై యాక్షన్ కామెడీ జానర్ ఫిల్మ్ అవుతుంది.

39 COMMENTS

సినిమా

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

రాజకీయం

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

ఎక్కువ చదివినవి

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

వైసీపీ నేతల అరాచకాలు.. ఉత్తరాంధ్ర వెనకబాటు..

ఏపీకి ఉత్తరాంధ్ర గుండెకాయ లాంటిది. అలాంటి ప్రాంతం వెనకబాటు వెనక వైసీపీ నేతల దారుణాలు ఉన్నాయంటున్నారు కూటమి నేతలు. అందుకే గల కారణాలను కూడా చూపిస్తున్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో పారిశ్రామిక...

వైసీపీ చేజారిన జీవీఎంసీ మేయర్ పీఠం: ఇది దేవుడి స్క్రిప్ట్.!

వైసీపీ హయాంలో స్థానిక ఎన్నికలు ఎలా జరిగాయో చూశాం. ఎన్ని అరాచకాలు చేసి ఆయా కార్పొరేషన్లను వైసీపీ దక్కించుకుందో, సాక్ష్యాలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో అందుబాటులోనే వున్నాయి. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన...

వైసీపీ అనుకూల వర్గాలు.. జనసేన ఖాతాలోకి..?

ఏపీ రాజకీయాల్లో జనసేన జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. కచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి ఇంకా బలమైన శక్తిగా మారాలని చూస్తోంది. ముఖ్యంగా కొన్ని వర్గాలను జనసేనకు కంచుకోటగా మార్చుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 22 ఏప్రిల్ 2025

పంచాంగం తేదీ 22-04-2025, మంగళవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5.44 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:18 గంటలకు. తిథి: బహుళ నవమి మ 1.03 వరకు,...