తెలుగు సినీ పరిశ్రమకు తీపి కబురు అందబోతోంది. త్వరలో షూటింగులకు అనుమతి లభించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని, తమ ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు ముందుకొచ్చిందంటూ ఈ రోజు ప్రభుత్వ పెద్దలను కలిసిన సినీ ప్రముఖుల బృందం అభిప్రాయపడింది. త్వరలోనే జీవో పాస్ అవుతుందని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున అభిప్రాయపడ్డాడు. దర్శకుడు రాజమౌళి, ‘మా’ అధ్యక్షుడు నరేష్ సహా పలువురు ప్రముఖులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అంతా బాగానే వుందిగానీ, సినిమా షూటింగులు ప్రారంభమయితే సోషల్ డిస్టెన్సింగ్.. అదేనండీ, ఫిజికల్ డిస్టెన్స్ మెయిన్టెయిన్ చేయడం సాధ్యమయ్యే పనేనా.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘మాది చాలా ప్రత్యేకమైన విభాగం. మేకప్ మేన్ వుంటాడు.. టచ్ అప్స్ చేస్తుండాలి.. క్లోజ్ కాంటాక్ట్ తప్పనిసరి. ఇతరత్రా విషయాల్లోనూ ఇలాంటి సమస్యలుంటాయి. దానికి ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వం మాకు కొన్ని సూచనలు చేసింది. మేం ఏం చేయగలమన్నదీ ప్రభుత్వానికి వివరంగా చెప్పాం..’ అని ‘మా’ అధ్యక్షుడు నరేష్ చెప్పుకొచ్చారు.
నిజానికి, సినిమా షూటింగులు అంత తేలికైన వ్యవహారం కాదు. టెక్నీషియన్లను పొరుగు రాష్ట్రాల నుంచీ.. అవసరమైతే విదేశాల నుంచీ తీసుకురావాల్సి వస్తుంది. హీరోయిన్లు ముంబై నుంచి ఎక్కువగా వస్తుంటారన్నది ఓపెన్ సీక్రెట్. ఇక, సినిమా షూటింగుల కోసం ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం తిరగాల్సి వస్తుంది యూనిట్ సిబ్బందికి. వాన పాటలు, హెవీ యాక్షన్ ఎపిసోడ్స్.. వీటన్నిటి సమయంలో సోషల్ డిస్టెన్సింగ్ ఎంతవరకు సాధ్యం.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.
ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ హీరో – హీరోయిన్ల మధ్య పండాలంటే అది మళ్ళీ ఇంకో సమస్య. అయితే, పూర్తిగా సినిమా షూటింగులు బంద్ చేసుకోవడం కంటే, సాధ్యమైనంతమేరకు కొన్ని ‘పరిమితులకు లోబడి’ సినిమా షూటింగులు జరపడమే ప్రస్తుత పరిస్థితుల్లో మంచిది. సినిమా షూటింగులు మొదలవుతాయ్ సరే.. మరి, రిలీజ్ల మాటేమిటి.? సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి.? ఇది ఇంకో సమస్య.
త్వరలో సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశం వుంది గనుకనే.. ముందుగా సినిమా షూటింగుల కోసం ప్రభుత్వానికి సినీ పరిశ్రమ విజ్ఞప్తి చేసిందని అనుకోవాలి. సినిమా పరిశ్రమ నుంచి ప్రభుత్వాలకి వచ్చే ఆదాయం ఎక్కువే గనుక.. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు కాసిన్ని వెసులుబాట్లు అదనంగా కల్పించాల్సి వుంటుంది.
563392 803251I like this internet site its a master peace ! Glad I discovered this on google . 349905
400173 114196I gotta favorite this website it seems handy very beneficial 192031
402488 783424Id forever want to be update on new articles on this site, bookmarked ! . 942336