Switch to English

బిగ్‌ స్టోరీ: ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యత తీసుకోగలరా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి అలాగే టీడీపీ మహానాడు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ సినిమా రంగంలో సాధించిన ఘనతలు గురించీ, రాజకీయ రంగంలో ఘనతల గురించీ బాలయ్య చెప్పడం మామూలే. చంద్రబాబుపైనా, లోకేష్‌పైనా పొగడ్తలు కొత్తేమీ కాదు.

‘వైఎస్సార్సీపీ ఐదేళ్ళు మనుగడ సాధించడం కష్టమే..’ అని బాలయ్య వ్యాఖ్యానించడం కాస్త ఆసక్తి కలిగించే విషయం. ‘ఇదేం ప్రభుత్వం.? ఇదేం పాలన.?’ అంటూ వైసీపీపై బాలయ్య విరుచుకుపడిపోయారు. టీడీపీపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేస్తుండడం, వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుండడంపైనా బాలయ్య మాట్లాడారు. ‘కార్యకర్తలకు మేం అండగా వుంటాం. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా నేనక్కడ వాలిపోతాను..’ అనే రేంజ్‌లో బాలయ్య, పార్టీ క్యాడర్‌కి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకన్నా బాలయ్య అభిమానులకైనా, టీడీపీ కార్యకర్తలకైనా కావాల్సిందేముంది.?

అయితే, ఎమ్మెల్యేగా బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురం ప్రజలకు అందుబాటులో వుండడంలేదని వైసీపీ చాలాకాలంగా విమర్శిస్తోంది. ఇంకోపక్క బాలయ్య తాజా వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదని వైసీపీ నేతలు లైట్‌ తీసుకుంటున్నారు. కానీ, బాలయ్య అభిమానులకి.. తమ అభిమాన నటుడ్ని పవర్‌ ఫుల్‌ లీడర్‌గా రియల్‌ లైఫ్‌లో చూడాలనే కోరిక వుంది.

వైసీపీ ప్రభుత్వం, వైసీపీ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారులపై చిన్న చిన్న విషయాలకే కేసులు నమోదు చేయిస్తుండడం చూస్తున్నాం. ఇలాంటివారి విషయంలో బాలయ్య లాంటి వ్యక్తి రంగంలోకి దిగి, పార్టీ క్యాడర్‌కి ప్రత్యక్షంగా భరోసా ఇస్తే అది పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందన్నది నిర్వివాదాంశం. మహానాడు కార్యక్రమం కోసం జూమ్ యాప్‌ ద్వారా మాట్లాడి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన బాలయ్య, అదే ఉత్సాహాన్ని గ్రౌండ్‌ లెవల్‌లో కూడా చూపిస్తారా.? ఏమోగానీ, బాలయ్య సినీ పరిశ్రమలోని తాజా పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

‘సినీ పెద్దలు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో భేటీ అయ్యింది భూములు పంచుకోవడం కోసమా.? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారా.?’ అంటూ నోరు పారేసుకున్నారు బాలయ్య. దీనిపై మంత్రి తలసాని కూడా నొచ్చుకున్నారు. ఒకేరోజు రెండు ఆసక్తికరమైన అంశాలతో బాలయ్య టాక్‌ ఆఫ్‌ ది తెలుగు స్టేట్స్‌ అయ్యారు. సినిమా సంగతుల్ని పక్కన పెడితే, బాలయ్య టీడీపీ బాధ్యతలు తీసుకోవాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్న దరిమిలా.. అంత సాహసం ఆయన చేయకపోయినా.. టీడీపీ ప్రస్తుతం ఎదుర్కంటోన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో.. బాలయ్య ’లీడ్‘ తీసుకోవాల్సిందే రాజకీయంగా.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

కడపలో వైసీపీకి షర్మిల డ్యామేజ్.! వర్ణనాతీతమే.!

‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...